‘చిలసౌ’ బాగా రావడంలో నాగార్జున రోల్ చెప్పిన సుశాంత్
July 30, 2018 / 01:30 PM IST
|Follow Us
సాఫ్ట్ హీరోగా పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రం “చిలసౌ”. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సుశాంత్ అనేక ఆసక్తికర సంగతులు చెప్పారు. “చిన మావయ్య(నాగార్జున) ముందు నుంచి సినిమాల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోమనేవారు. కొంచెం కన్ఫ్యూజన్తో ఇతరుల సలహాలు తీసుకునేవాణ్ణి. ఈ సినిమా విషయంలో మాత్రం నేనే నిర్ణయం తీసుకున్నా.
బయట నిర్మాతలతో చేయాలని ముందే డిసైడ్ అయ్యాను. అమ్మకు కథ కూడా తెలియదు. సినిమా పూర్తయ్యాక చైతూ, సమంతలకు రాహుల్ సినిమా చూపించడం, అక్కడి నుంచి మావయ్య దగ్గరకు వెళ్లడంతో అన్నపూర్ణ సంస్థ ద్వారా విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు” అని వివరించారు. సినిమా తొలి కాపీ చూసిన తర్వాత నాగార్జున కొన్ని మార్పులు చూపించారంటా. ఆ విషయం గురించి మాట్లాడుతూ.. ” సినిమా చూసి మావయ్య కొన్ని సలహాలు ఇచ్చారు. మేం రీషూట్స్ చేశాం. దాంతో సినిమా మరింత బాగా వచ్చింది” అని సుశాంత్ వివరించారు. ఇదివరకు కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా.. వంటి సినిమాలతో సుశాంత్ నటుడిగా నిరూపించుకున్నారు. కానీ మంచి హిట్ అందుకోలేకపోయారు. ఈసారైనా విజయం సాధిస్తారేమో చూడాలి.