అక్కినేని నాగార్జున ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నా సామి రంగ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీపై మాత్రమే కాకుండా ఇతర రంగాలపై కూడా సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది అని చెప్పాలి. ఏదైనా ఒక విషయం గురించి పాజిటివ్ కంటే నెగిటివిటీగానే సోషల్ మీడియాలో చాలా తొందరగా స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే.
తద్వారా ఎన్నో వివాదాలు విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నా సామి రంగ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాగార్జున సోషల్ మీడియా యూజర్లపై తన స్టైల్ లో చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివ్ కామెంట్లకు మూల కారణంగా ట్విట్టర్ నిలిచిందనే చెప్పాలి. ఈ సందర్భంగా ట్విట్టర్ యూజర్లను ఉద్దేశిస్తూ నాగార్జున (Nagarjuna) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ట్విట్టర్ అనేది పూర్తిగా నెగటివ్ ట్రెండ్‌లోకి వెళ్లిపోయింది. తాను జాయిన్ అయినప్పుడు ఇలా లేదు. చాలా వరకు వాళ్లంతా ఒక చీకటి రూములో కూర్చొని, వాడు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తున్నాడు ఇక్కడ మనం ఆగమైపోతున్నాము అంటూ ఈయన తెలిపారు. అందుకే తాను ఇలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటున్నానని ఈ సందర్భంగా నాగార్జున తెలిపారు.
అయితే ఇటీవల కాలంలో ఇలాంటి నెగిటివ్ కామెంట్లు ట్రోల్స్ కి గురికాకుండా ఉండడం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా తమ సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!