నాగార్జున (Nagarjuna) సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నేనున్నాను సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. వీఎన్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ఏ శ్వాసలో చేరితే ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) మ్యూజిక్ అందించగా ఏ శ్వాసలో చేరితే సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్ రైటర్ గా పని చేయడం జరిగింది. రెండు లైన్లలోనే పాటలోని భావమంతా అర్థమయ్యేలా రాయడం సిరివెన్నెల గొప్పదనమని నాగ్ పేర్కొన్నారు. సిరివెన్నెల రాసిన ఓనమాలు రాయాలని సాంగ్ ప్రతి కుటుంబానికి సరిపోతుందని ఒక తండ్రి కొడుకుకు చెప్పాలనుకున్న మాటలన్నీ ఆ పాటలో చెప్పేశారని నాగ్ తెలిపారు.
నేను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమాకు సిరివెన్నెల పాటలు రాశారని నాగ్ అన్నారు. ఆ సమయంలో సిరివెన్నెలతో ఎక్కువగా సమయం గడిపే ఛాన్స్ వచ్చిందని నాగార్జున చెప్పుకొచ్చారు. నేనున్నాను (Nenunnanu) సినిమా హిట్ కావడానికి ఏ శ్వాసలో చేరితే సాంగ్ కారణమని నాగ్ వెల్లడించారు. నా సినిమాల్లో శాస్త్రి గారి పాటలు ఎక్కువగా ఉండటానికి ప్రత్యేకమైన కారణం లేదని నాగార్జున పేర్కొన్నారు. సిరివెన్నెల గారు నాకు ఇష్టమైన రచయిత అని నాగార్జున వెల్లడించడం గమనార్హం.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో చనువు ఎక్కువ అని ఏదైనా నచ్చకపోయినా అర్థం కాకపోయినా మార్చమని అడిగేవాడినని నాగ్ పేర్కొన్నారు. ఊపిరి సినిమాలోమి నువ్వేమిచ్చావో సాంగ్ సినిమాలోని అర్థాన్ని చూపిస్తుందని నాగార్జున తెలిపారు. నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నాగార్జున 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. నాగార్జునకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది.