Nagarjuna: వందవ సినిమా అలా ఉండాలి.. అసలు విషయం చెప్పిన నాగార్జున!
September 20, 2022 / 04:14 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున గత మూడు దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. నాగార్జున ఇప్పటికి వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇలా వరుస సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్టుగా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఇటీవల నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటించాడు. విజువల్ వండర్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాగార్జున సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. తన 100 వ సినిమా కోసం పక్కా ప్రణాళికతో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ సినిమా కోసం ఇప్పటికి ఇద్దరు దర్శక నిర్మాతలతో చర్చలు జరిపినట్లు కూడా నాగ్ వెల్లడించాడు. ఇక నాగార్జున నటించబోయే 100 వ సినిమా ఎలా ఉండాలనుకుంటున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగార్జున స్పందిస్తూ..”నా 100వ సినిమా ఒక విజువల్ వండర్లా ఉండాలి కానీ మరీ ‘బ్రహ్మాస్త్ర’లా కాకపోయినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉండాలి.
సినిమాలు గ్రాఫిక్స్ ఎక్కువగా లేకపోయినా కూడా తాజాగా విడుదలైన ‘సీతారామం’ అలాగే ఇటీవల శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమాల లాగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని నాగర్జున వెల్లడించారు. మొత్తానికి తన 100 వ సినిమా కోసం నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.