నాగ చైతన్య, సమంతల సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన నాగార్జున
September 4, 2017 / 10:57 AM IST
|Follow Us
టాలీవుడ్ ప్రేమ జంట నాగ చైతన్య, సమంతలు త్వరలో భార్య భర్తలు కాబోతున్నారు. అక్టోబర్ 6 న గోవాలో పెళ్లిచేసుకోబోతున్నారు. అప్పటి లోపున తమ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఇద్దరూ బిజీగా ఉన్నారు. అక్కినేని నాగార్జున కూడా కొత్త దంపతులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ వేస్తున్నారు. రాజు గారి గది 2 సినిమా షూటింగ్ లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ కొడుకు, కోడలు ఆనందంగా ఉండడానికి ఓ మంచి కాటేజ్ ని కట్టించే పనిలో ఉన్నారు. నాగ్ కి అన్నపూర్ణ స్టూడియోలో మంచి కాటేజ్ ఉంది.
అక్కడే నాగ్ రెస్ట్ తీసుకుంటుంటారు. అటువంటి అందమైన కాటేజ్ ని అన్ని సౌకర్యాలతో స్టూడియోలో నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇంటీరియర్ మొత్తం విదేశీ వస్తువులతో నింపుతున్నట్లు సమాచారం. తప్పకుండా ఈ కాటేజ్ ప్రేమ పక్షులకు నచ్చుతుందని, వారి ఆనందనాన్ని ఇస్తుందని నాగ్ నమ్ముతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య యుద్ధం శరణం సినిమా ప్రమోషన్ తో పాటు, సవ్యసాచి సినిమా షూటింగ్ లోను పాల్గొంటున్నారు. మొన్ననే రాజు గారి గది 2 ని కంప్లీట్ చేసి బయటికి వచ్చిన సమంత తన మిగిలిన ఐదు సినిమాలను చకచకా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.