ప్రొఫెషనల్ ఎథిక్స్ (వృత్తి ధర్మం) అనే మాట సినిమాల్లో వినడమే కానీ.. సినీ పరిశ్రమలో అస్సలు పాటించరు అనేది ఇండస్ట్రీకి ఉన్న బేడ్ నేమ్. కొంతవరకూ అది కూడా నిజమే అనుకోండి. సీనియర్ హీరోలు మినహా ఎవరూ సెట్ కి టైమ్ కి రారు, నిర్మాతలకు సహకరించరు. అన్నిటికీ మించి నిర్మాత కష్టాల్లో ఉన్నా సంబంధం లేకుండా తన గొంతెమ్మ కోర్కెలు తీర్చమని, రెమ్యూనరేషన్ మొత్తం ఇస్తే గానీ డబ్బింగ్ చెప్పమని నానా యాగీ చేస్తుంటారు.
ఒక్కోసారి ఇంట్లో ఉన్న సమస్యల కారణంగా సెట్లో అందరి మీద సీరియస్ అవుతూ.. సెట్ వాతావరణాన్ని పాడు చేస్తుంటారు. అయితే.. తన ఇంట ఇంత పెద్ద విషయం జరిగినా, ఏమాత్రం కృంగిపోకుండా నాగార్జున తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. శనివారం ఉదయం నాగాచైతన్య-సమంత విడాకుల విషయం పబ్లిక్ ఎనౌన్స్ మెంట్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా అదే రోజు నాగార్జున బిగ్ బాస్ సండే ఎపిసోడ్ షూటింగ్ లో ఉన్నాడు.
నిజానికి సొంత కొడుకు కాపురం అలా కూలిపోతుంటే.. ఏ తండ్రి మాత్రం ఓర్చుకోగలడు చెప్పండి. కానీ.. నాగార్జున మాత్రం బిగ్ బాస్ సెట్ లో తన పర్సనల్ ప్రోబ్లమ్స్ కారణంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు అని జాగ్రత్తపడుతూ.. ఎపిసోడ్ షూట్ చేసి సైలెంట్ గా ఇంటికెళ్లిపోయాడు. ఆఖరికి నాగార్జున ట్వీట్ వేసింది కూడా బిగ్ బాస్ సెట్ నుంచేనని తెలిసినవాళ్ళందరూ ఆయన ప్రొఫెషనల్ ఎథిక్స్ ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!