నాగార్జున రోల్ ఏంటీ చెప్మా ?

  • August 27, 2016 / 10:41 AM IST

నాగచైతన్య పరిచయ చిత్రానికి కూడా నాగార్జున ఈ రేంజ్ లో జాగ్రత్తలు తీసుకొని ఉండడు. అయితే.. వరుస ఫ్లాపులతో చైతూ కెరీర్ కష్టాల్లో పడడం, రెండో తనయుడి పరిచయ చిత్రమే డిజాస్టర్ గా నిలవడంతోపాటు ఇప్పటివరకూ సెకండ్ సినిమా ఎంటనేది తేల్చుకోలేని కన్ఫ్యూజన్ తో కొట్టుమిట్టాడుతుండడంతో.. ఇద్దరి తనయుల కెరీర్ లను చక్కదిద్దే పనిలో పడ్డాడు నాగార్జున.

అందుకే అఖిల్ సెకండ్ సినిమాను సెట్ చేసే పనిలో స్వయంగా నిమగ్నమవ్వడంతోపాటు.. పెద్దబ్బాయి నాగచైతన్య తాజా చిత్రం “ప్రేమమ్”ను కూడా ఎలాగైనా సక్సెస్ చేయాలని తపన పడుతున్నాడు. అందుకే ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేశాడట.

అయితే.. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి ఒకటే డౌట్, నాగార్జున ఏ పాత్రను పోషిస్తున్నాడా? అని. నాగచైతన్య తండ్రిగా వెంకటేష్ నటించగా, నాగార్జున పాత్ర ఎంటనేది ప్రస్తుతం అందరి మనసుల్ని తొలిచేస్తున్న ప్రశ్న. మలార్ పాత్ర పోషిస్తున్న శృతి హాసన్ తండ్రి పాత్ర ని కొంతమంది భావిస్తుండగా, లాస్ట్ లో కనిపించి వాయిస్ ఓవర్ తో సినిమాను ఎండ్ చేస్తాడని ఇంకొందరు ఊహించుకొంటున్నారు. ఏదేమైనా.. నాగార్జున రోల్ విషయంలో టెన్షన్ వదలాలంటే సెప్టెంబర్ వరకూ ఆగాల్సిందే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus