Nagarjuna, Sekhar Kammula: నాగ్ శేఖర్ కమ్ముల కాంబో మూవీలో ఛాన్స్ దక్కిన బ్యూటీ ఆమేనా?

  • December 11, 2023 / 10:35 AM IST

లవ్ స్టోరీ సినిమాతో శేఖర్ కమ్ముల మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు శేఖర్ కమ్ముల రేంజ్ ను పెంచాయి. శేఖర్ కమ్ముల పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉండగా ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ మూవీని శేఖర్ కమ్ముల ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా త్రిష కనిపించనున్నరని సమాచారం అందుతోంది. చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబో మూవీ కోసం మొదట అనుష్క పేరు వినిపించినా ఆమె స్థానంలో త్రిష నటిస్తున్నారు.

చిరంజీవి ఛాన్స్ ఇచ్చిన బ్యూటీకే నాగార్జున కూడా ఛాన్స్ ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. నాగార్జున ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నాగ్ ప్రస్తుతం నా సామిరంగ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. సంక్రాంతి రేసులో నాగార్జున కూడా విజేతగా నిలుస్తారేమో చూడాల్సి ఉంది. నాగార్జున త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఇతర భాషల్లో సైతం నాగార్జున సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ బిన్నీ డైరెక్షన్ లో నా సామిరంగ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. సంక్రాంతికి విడుదలైన నాగ్ సినిమాలు మెజారిటీ సందర్భాల్లో ఆయనకు సక్సెస్ ను అందించాయి. నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో సీజన్7 సక్సెస్ తో నాగ్ పేరు మారుమ్రోగుతోంది.

నాగచైతన్య దూత వెబ్ సిరీస్ తో సక్సెస్ సాధించడంతో నాగార్జున, అఖిల్ కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. (Nagarjuna) నాగార్జున పారితోషికం ప్రస్తుతం 13 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus