కింగ్ నాగార్జున మంచి ఊపు మీద ఉన్నాడు. మొన్న ‘మనం’…నిన్న ‘సొగ్గాడే’…నేడు ‘ఊపిరి’ ఇలా ప్రయోగాత్మక చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. నాగ్ తాజాగా నటిస్తున్న ‘ఊపిరి’ సినిమా గురించి మీడియాతో ముచ్చటించిన ఈ హీరో ఎన్టీఆర్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముందుగా ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ…ఊపిరిలో నా పాత్ర కింగ్‌లాగా ఉంటుంది. ఒక రేంజ్లో ఉన్న బిలీనియర్ కేరక్టర్ అది. వీల్ చెయిర్లో కూర్చున్న పేషంట్లాగా ఎక్కడా అనిపించదు. లైవ్లీగా ఉంటుంది. అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి ఉంటుంది. ఏంటి ఆ వెలితి అనేది మీదు స్క్రీన్ పై చూడాల్సిందే అని నాగ్ చెప్పాడు. ఇక అదే క్రమంలో కార్తి పాత్ర పై కూడా నాగ్ పెదవి విప్పాడు…కార్తి పాత్ర ఎలా ఉంటుంది అంటే…ఈ సినిమాలో కార్తి పాత్ర పేరు..శ్రీను, నాకు మంచి తోడుగా ఉండే పాత్ర ఇది. శీను స్లమ్ నుంచి వచ్చిన కుర్రాడు. ఆ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు అంటూ నాగ్ తెలిపాడు.
ఇక ఈ పాత్రను ఎన్టీఆర్ చేస్తాడు అని వార్తలు వచ్చాయి దానిపై మీ స్పందన ఏంటి అంటే…నాగ్ మాట్లాడుతూ…నిజమే, స్ర్కిప్ట్ దశలో కార్తీ పాత్రకోసం ముందు తారక్‌ను అనుకున్నాం. కానీ తనకు కాల్షీట్లు కుదరలేదు. తర్వాత కార్తీని తీసుకున్నాం. కార్తి చాలా మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అతనికి సూర్య ఎంతో నేనూ అంతే. అంత గౌరవంగా, ఆప్యాయంగా చూసుకుంటాడు.
అని కార్తి గురించి తెలిపాడు నాగ్, ఇదిలా ఉంటే ప్రస్తుతం యువ హీరోల స్టార్ డమ్ పై కామెంట్ చేస్తూ…మంచి స్ర్కిప్ట్‌లను ఎంపిక చేసుకుని నటిస్తే స్టార్డమ్ అదే వస్తుంది అని. మన దగ్గర 30 ఏళ్ళకు ముందు స్టార్డమ్ వచ్చిన వాళ్ళు తక్కువే. మహేష్, ప్రభాస్, పవన కల్యాణ్… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి 30ఏళ్ళ తర్వాతే స్టార్డమ్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఒక్క తారక్‌కి మాత్రమే స్టార్ డమ్ అతి చిన్న వయసులో వచ్చింది అని నాగ్ తెలిపాడు. నిజమే కదా మరి.