Nagarjuna: హౌస్ మేట్స్ నిజమైన ర్యాంకింగ్స్ లో నిలుచున్నారా..? నాగార్జునకి భయపడ్డారా..?

  • December 12, 2021 / 01:09 PM IST

బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ జరిగిన టాస్క్ లలో ర్యాంకింగ్ టాస్క్ ఒకటి. నామినేషన్స్ అప్పుడు ర్యాంకింగ్స్ టాస్క్ లో భాగంగా మొదటి స్థానంలో సన్నీ, 2వ స్థానంలో షణ్ముక్, 3వ స్థానంలో కాజల్, 4వ ప్లేస్ లో శ్రీరామ్, 5వ ప్లేస్ లో సిరి, 6వ ప్లేస్ లో మానస్ నిలుచున్నారు. అయితే, ఈ నామినేషన్స్ టాస్క్ ని అస్సలు సీరియస్ గా ఆడలేదు అంటూ మరోసారి హోస్ట్ ఈ టాస్క్ ని అడించాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కరు వచ్చి 1వ ప్లేస్ లో నుంచుంటే, కాజల్, సిరి ఇద్దరూ కూడా 2వ స్థానం చాలన్నట్లుగానే మాట్లాడారు. మళ్లీ కింగ్ నాగార్జున మాటలు విని కాజల్ ఇంకా సిరి ఇద్దరూ కూడా ఫస్ట్ ప్లేస్ కే పోటీ పడ్డారు.

ఫైనల్ గా ర్యాంకింగ్స్ స్టేజ్ పైన నిలుచోమని చెప్పగానే, మొదటి స్థానానికి శ్రీరామ్, కాజల్, సిరి అక్కడ నుంచుని ఉన్నారు. సెకండ్ లో షణ్ముక్, తర్వాత సన్నీ మానస్ లు నుంచున్నారు. ఇక్కడే మరోసారి హౌస్ కాల్ అంటూ ఓటింగ్ పెట్టాడు కింగ్ నాగార్జున. ఫస్ట్ ప్లేస్ లో నుంచున్న వారికి ఓట్ వేయమని చెప్పాడు. దీంతో ఫస్ట్ ప్లేస్ లో అనూహ్యంగా సిరి సెటిల్ అయ్యింది. ఆ తర్వాత ప్లేస్ లో శ్రీరామ్, కాజల్, షణ్ముక్, సన్నీ , మానస్ లు వరుసగా నుంచున్నారు.

ఇక్కడే హౌస్ మేట్స్ ఇంకా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. హౌస్ కాల్ అంటే ఇప్పటికి తేలదు అంటూ శ్రీరామ్ చెప్పాడు. అలాగే, ఫస్ట్ ర్యాంకింగ్ దగ్గర ప్లేస్ లేకపోవడంతో మానస్, షణ్ముక్, సన్నీ ముగ్గురు కూడా మిగతా చోట్ల నుంచోవాల్సి వచ్చింది. కానీ, ముందుగా నాగార్జునతో వాళ్లు ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలని అనుకుంటున్నామని చెప్పారు. కానీ, నాగార్జునకి రెస్పెక్ట్ ఇస్తూ, భయపడుతూ వాదన ఎందుకులే అని హౌస్ మేట్స్ ఏదో ఒక స్థానంలో డిసైడ్ అయిపోయారు. మొత్తానికి అనుకున్న ర్యాంకింగ్స్ మాత్రం హౌస్ మేట్స్ కి దక్కలేదు. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus