బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో నాలుగోవారం సెవన్ ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ అయిపోయింది. నాగార్జున ఒక్కొక్కరిని సేఫ్ చేస్తున్న స్టేజ్ లో సరయు బాగా భయపడిపోయింది. తను ఎలిమినేట్ అవుతానని ముందుగానే గ్రహించింది. లాస్ట్ లో మిత్రాశర్మాతో పాటుగా ఉండేసరికి ఇంకా అనుమానం బలపడింది. సరయు ఎలిమినేట్ అనగానే అందరితో మాట్లాడటం మొదలుపెట్టింది. నామినేషన్స్ అప్పుడు రీజన్స్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోమని, మంచిగా గేమ్ ఆడమంటూ కాస్త అసహనాన్ని ప్రదర్శించింది. అప్పుడే హమీదా సరయు నోటికి తాళం వేసింది. వెళ్లిపోయేటపుడు ఇవన్నీ మాట్లాడద్దంటూ హితవు చెప్పింది.
ఇక సరయు ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ టీమ్ కావాలనే చేసిందా అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. నిజానికి అన్ అఫీషియల్ ఓటింగ్ సైట్స్ లో సరయు సేఫ్ జోన్ లోనే ఉంది. సరయు కంటే లీస్ట్ లో అనిల్ రాథోడ్ ఇంకా మిత్రాశర్మా ఇద్దరూ ఉన్నారు. వీరిద్దరూ టాస్క్ లు కానీ, గేమ్ కానీ బాగా ఆడుతున్నారు. కంటెంట్ అనేది ఇస్తున్నారు. కానీ, సరయు నుంచీ ఎలాంటి కంటెంట్ రావట్లేదు. అరియానాతో ఆర్గ్యూమెంట్ తప్ప, హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా కూడా లేదు. టాస్క్ లు ఆడేటపుడు ఆడలేక చతికలపడిపోతోంది.
హౌస్ మేట్స్ కూడా చాలాసార్లు టాస్క్ గివ్ అప్ ఇవ్వకు అని కూడా చెప్పారు. ఇక స్కిట్ లో కూడా పెద్దగా పెర్ఫామెన్స్ లేదు. వీకండ్ నాగార్జున ఎపిసోడ్ లో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. అందుకే, సరయుని టార్గెట్ చేసి బిగ్ బాస్ టీమ్ కావాలనే ఎలిమినేట్ చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వీకండ్ నాగార్జున హౌస్ మేట్స్ కి ఇస్తున్న డోస్ , క్లాస్ సరిపోవట్లేదు. పైగా వాళ్లు జోకులు వేసుకునేలా ఉంటోంది. గేమ్ లో ముఖ్యంగా టాస్క్ ఆడేటపుడు ఎవరు మిస్టేక్ చేశారు అనేది చాలా క్లియర్ గా చెప్పాలి.
చెప్తేనే వాళ్ల గేమ్ మారుతుంది. కానీ, నాగార్జున చాలా లైటర్ వే లో వాళ్లని మందలించి వదిలేస్తున్నారు. అరియానా సంచాలక్ గా ఎలా చేసిందనేది అస్సలు టచ్ చేయలేదు. అలాగే, బిందుమాధవి టాస్క్ లో అఖిల్ తో, అజయ్ తో గొడవపడిన టాపిక్ ని కూడా తీసుకుని రాలేదు. అఖిల్ ని ఏ ఉద్దేశ్యంలో అన్నదో అఖిల్ కి వీడియో చూపించి ఉండాల్సింది. అది కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఇక అరియానా ముందుగానే మాస్టర్ తో డీల్ చేసుకున్నది హౌస్ మేట్స్ కి చూపించి ఉండాల్సింది. సంచాలక్ గా ఎలా మారిందో హౌస్ మేట్స్ చూస్తే ఖచ్చితంగా నామినేషన్స్ అప్పుడు ఈ పాయింట్ వచ్చేది.
అలాగే లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు నటరాజ్ మాస్టర్ ఇచ్చిన రీజన్స్, మహేష్ విట్టా ఇచ్చిన రీజన్స్ నామినేట్ చేసిన హౌస్ మేట్స్ గురించి నిలదీసి ఉండాల్సింది. నాగార్జున హౌస్ మేట్స్ కి ఎలాంటి ఇన్ పుట్స్ ఇవ్వడం లేదు. దీంతో వాళ్ల గేమ్ రైట్ వే లో వెళ్తోందా, రాంగ్ వే లో వెళ్తోందా అనేది వాళ్లు ఊహించలేకపోతున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాట్ ఓటీటీలో ఈసారి ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఐదోవారం హౌస్ వేడెక్కకపోతే ఐపియల్ ఇంపాక్ట్ బిగ్ బాస్ పై పడే అవకాశం కనిపిస్తోంది. అదీ మేటర్.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?