‘బిగ్ బాస్’ హౌస్ కి పండగ వాతారణం తెచ్చిన కింగ్..!

  • October 9, 2019 / 06:41 PM IST

కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే కనువిందు చేసే నాగార్జున ఇప్పుడు దసరా పండుగ రోజున కూడా సందడి చేశాడు. విషయంలోకి వెళితే.. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3’ ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుని 12 వ వారం లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక నిన్న దసరా పండుగ కావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసాడు నాగార్జున. ‘సోగ్గాడే చిన్ని నాయన’ గెటప్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ‘నా రమ్య ఎక్కడ’ అంటూ సరదాగా హౌస్ మేట్స్ ను ప్రశ్నించారు.

హౌస్ మేట్స్ చేసిన వంటలను తిని.. అలాగే వారికోసం గిఫ్ట్స్, స్వీట్స్ కూడా తీసుకొచ్చి వారికిచ్చారు. ఇక బుధవారం రోజున కూడా ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది. హౌస్ మేట్స్ అందరితో కొన్ని గేమ్స్ ఆడించి.. కామెడీ కూడా చేశారు నాగార్జున. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ ను స్టోర్ రూమ్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఐటెం ను తీసుకురమ్మని చెప్పారు. అందులో ఏముంది అని నాగార్జున.. వరుణ్ ను అడుగగా బ్రెడ్, పేస్ట్రీ, అరటిపండు అని సమాధానమిచ్చాడు. అప్పుడు నాగార్జున అది అరటిపండు కాదు ఫ్రూట్ అంటూ వరుణ్ పై సెటైర్ వేసి అందరినీ నవ్వించాడు. ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus