Nagarjuna, Lakshmi: నాగార్జున – లక్ష్మి ల వింటేజ్ పిక్ వైరల్..!
July 20, 2022 / 02:48 PM IST
|Follow Us
అక్కినేని నాగేశ్వర రావు గారి చిన్నబ్బాయి గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ను ఎక్కువగా వాడుకోకుండా.. తన సొంత టాలెంట్ తో స్టార్ గా ఎదిగారు అన్న సంగతి తెలిసిందే.నాగార్జున చాలా తెలివైన వ్యక్తి అని ఇండస్ట్రీలో అందరూ అంటుంటారు. ఆయన పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెరిచిన పుస్తకమే.! ముఖ్యంగా నాగార్జున రెండు పెళ్లిళ్ల వ్యవహారం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున తన మొదటి భార్య లక్ష్మీతో విడాకులు తీసుకున్న కొన్నాళ్ల తర్వాత అమలని పెళ్లి చేసుకున్నారు.
ఈమె టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు గారి అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు కలిగిన సంతానమే నాగ చైతన్య. నాగార్జున, అమల దంపతుల సంతానం అఖిల్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే లక్ష్మితో నాగార్జున విడాకులు తీసుకున్నప్పటికీ.. దగ్గుబాటి కుటుంబంతో ఆయన రిలేషన్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్. నాగ చైతన్య కెరీర్ విషయంలో కానీ, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాల్లో కానీ దగ్గుబాటి ఫ్యామిలీ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటుంది.
అలాగే నాగ చైతన్య మదర్ అయిన లక్ష్మి ఇప్పటికీ దగ్గుబాటి వారి ఇంటికి… అలాగే చైతన్య ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇటీవల తన తల్లికి ‘థాంక్యూ’ చెబుతూ నాగ చైతన్య పెట్టిన పోస్ట్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతం నాగార్జున – లక్ష్మి ల వింటేజ్ పిక్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో నాగ్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ఈ ఫోటోని మీరు కూడా ఓ లుక్కేయండి :