బిగ్ బాస్ షోలో ది ఎంట్రీ నాగార్జునకే దక్కింది

  • July 22, 2019 / 12:02 PM IST

నిన్న రాత్రి జరిగిన “బిగ్ బాస్ 3” ప్రారంభ ఎపిసోడ్ లో పార్టీసీపెంట్స్, కొత్త బిగ్ బాస్ హౌస్ సెట్ కంటే ఎక్కువగా ప్రేక్షకుల్ని అలరించిన విషయం “నాగార్జున ఎంట్రీ”. తనకున్న మన్మధుడు అనే ఇమేజ్ కు సార్ధకత్వం లభించేలా.. బోలెడంతమంది మోడల్స్ నడుమ నాగార్జున ఎంట్రీ అత్యంత అట్టహాసంగా జరిగింది. ఇదివరకు రెండు సీజన్లు హోస్ట్ చేసిన ఎన్టీఆర్, నానిల కంటే బెస్ట్ ఎంట్రీ నాగార్జునది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే.. శ్రీముఖి, వరుణ్ సందేశ్ మినహా ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గవారు షోలో లేకపోవడంతో వీక్షకులు కాస్త నిరాశ చెందారనే చెప్పాలి. ఈసారి బిగ్ బాస్ కాస్త గ్లామర్ మీద కాన్సన్ ట్రేట్ చేసినట్లున్నాడు. అందుకే.. హిమజ, ఆషూ రెడ్డి లాంటి వాళ్ళకు పెద్దగా ఫేమ్ లేకపోయినా తీసుకొచ్చి షోలో కూర్చోబెట్టాడు. ఇవాల్టి నుండి మొదలవ్వనున్న అసలు మజాలో.. ఎవరు ఎవర్ని ఎలా ట్యాకిల్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus