Nagarjuna: 10 ఏళ్ళుగా నాగార్జున రికార్డు బ్రేక్ కాలేదు..!
November 28, 2022 / 12:01 PM IST
|Follow Us
అక్కినేని నాగార్జున ఈ ఏడాది ‘బంగార్రాజు’ ‘ది ఘోస్ట్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘బంగార్రాజు’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే ‘ది ఘోస్ట్’ మాత్రం దసరా కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది. అయితే మధ్యలో నాగార్జున కీలక పాత్ర చేసిన ‘బ్రహ్మాస్త్రం’ మాత్రం తెలుగులో సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే 10 ఏళ్ళుగా నాగార్జున రికార్డ్ బ్రేక్ అవ్వకపోవడం ఏంటి?
అంతలా సూపర్ సక్సెస్ సాధించిన నాగ్ మూవీ ఏంటి? అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. వివరాల్లోకి వెళితే.. నవంబర్ అనేది సినిమాలకు అన్ సీజన్ లాంటిది అని అంతా అంటుంటారు. ఈ సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు లేవు. రజినీకాంత్- శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘2.ఓ’ చిత్రాన్ని పక్కన పెట్టేస్తే స్ట్రైట్ తెలుగు సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఒక్క నాగార్జునదే కావడం విశేషం.
అదెలా అంటే.. నాగార్జున హీరోగా అనుష్క హీరోయిన్ గా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ‘ఢమరుకం’ అనే మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఆర్.ఆర్.వెంకట్, అచ్చిరెడ్డి లు ఈ చిత్రాన్ని ఆ టైంకి నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో అంటే రూ.40 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. రిలీజ్ కు చాలా కష్టాలు పడిన ఈ మూవీ ఫైనల్ గా 2012 నవంబర్ 23న రిలీజ్ అయ్యింది.
పెద్దగా ప్రమోషన్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది. ఫుల్ రన్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేసింది.నవంబర్ వంటి అన్ సీజన్లో రిలీజ్ అయిన స్ట్రైట్ తెలుగు సినిమాల్లో ఈ మూవీదే రికార్డు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తికావస్తున్నా.. ఇప్పటివరకు ‘ఢమరుకం’ కలెక్షన్లను ఏ మూవీ కూడా అధిగమించలేకపోయింది. ఈ ఏడాది కూడా నాగ్ రికార్డ్ సేఫ్. వచ్చే ఏడాది ఏమైనా బ్రేక్ అవ్వుద్దేమో చూడాలి..!