Nagavamsi: ఆ సినిమాల్లో లాజిక్ చూడొద్దన్న నాగవంశీ.. ఆ అర్హత ఉందంటూ?
March 27, 2024 / 11:47 AM IST
|Follow Us
మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ సినిమాలా లేదని ఎక్కువమంది కామెంట్లు చేశారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే ఆ సినిమాలలో లాజిక్స్ ను వెతకడానికి ప్రయత్నించొద్దని ఆయన తెలిపారు. స్టార్స్ సినిమాలలో ఎలివేషన్లను చూసి సినిమాలను ఎంజాయ్ చేయాలని నాగవంశీ (Suryadevara Naga Vamsi) అన్నారు.
సలార్ లో (Salaar) ప్రభాస్ (Prabhas) యాక్టింగ్ అభిమానులకు ఎంతగానో నచ్చేసిందని అయితే కొందరు అభిమానులు మాత్రం సీన్స్ లో లాజిక్ లేదంటూ కామెంట్స్ చేశారని ఆయన తెలిపారు. గుంటూరు కారం సినిమాలో తరచూ హీరో హైదరాబాద్ వెళ్తున్నట్టు చూపించామని ఫాస్ట్ గా ఎలా వెళ్తాడని కామెంట్ చేసినంత మాత్రాన హీరో జర్నీ అంతా చూపించలేం కదా అంటూ రివర్స్ లో నాగవంశీ కౌంటర్ ఇచ్చారు.
సినిమాలో మాస్ సన్నివేశాలు లేవని త్రివిక్రమ్ మార్క్ సినిమాలా లేదని కామెంట్లు వచ్చాయని అయితే ఓటీటీ రిలీజ్ తర్వాత ఒపీనియన్ పూర్తిగా మారిపోయిందని నాగవంశీ వెల్లడించారు. సినిమాను కేవలం వినోదం కోణంలోనే చూడాలని ఆయన తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప రైటర్ అని ఆయనకు మూవీ ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదని నాగవంశీ అన్నారు.
సినిమా నచ్చని పక్షంలో బాగోలేదని కామెంట్ చేసే అర్హత ఎవరికైనా ఉంటుందని కానీ సినిమా యూనిట్ పై ఎవరు పడితే వారు మాట్లాడకూడదని నాగవంశీ పేర్కొన్నారు. నాగవంశీ కామెంట్లు కూడా నిజమేనని నెటిజన్లు చెబుతున్నారు. సితార బ్యానర్ లో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కొన్ని ఏరియాలలో టిల్లు స్క్వేర్ బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉంది. టిల్లు స్క్వేర్ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని మేకర్స్ భావిస్తున్నారు.