Nandini Rai: షూటింగ్ లో చెంప వాచిపోయేలా కొట్టాడు : నందిని రాయ్
June 18, 2021 / 06:45 PM IST
|Follow Us
కొన్నిసార్లు సినిమాలో సన్నివేశాలు సహజంగా రావాలనే ఉద్దేశంతో మన తారలు చాలా కష్టపడుతుంటారు. రీసెంట్ గా పరిణీతి చోప్రా ఓ సినిమాలో మురికిగా కనిపించాలని రెండు రోజులు స్నానం చేయకుండా ఉండిపోయింది. తాజాగా నటి నందిని రెడ్డి ఓ వెబ్ సిరీస్ కోసం తన చెంపలు వాచిపోయేలా కొట్టించుకుంది. ప్రియదర్శి, నందిని రాయ్, వికాస్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్ తాజాగా ‘ఆహా’లో విడుదల చేశారు.
ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నందిని కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ ఒక సీన్ లో తను, తన సహ నటుడు వికాస్ ఒకరినొకరు కొట్టుకోవాలని చెప్పింది. ఇది సహజంగా రావాలని దర్శకుడు చెప్పారని.. మొదటి వికాస్ తనను లైట్ గా కొట్టాడని కానీ ఆ సీన్ బాగా రాలేదని చెప్పింది. దీంతో తామిద్దరం నిజంగానే చెంపలు వాచిపోయాలా కొట్టుకుందామని ఫిక్స్ అయినట్లు చెప్పింది. ఆ తరువాత షూటింగ్ లో నిజంగానే కొట్టుకోవడంతో చెంపలు వాచిపోయాయని..
దీంతో దర్శకుడు బ్రేక్ ఇవ్వక తప్పలేదని గుర్తుచేసుకుంది. ఆ వాపు తగ్గే వరకు వెయిట్ చేసి అప్పుడు మరో సీన్ షూట్ చేశారని నందిని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో నందిని పల్లెటూరి అమ్మాయి నటి అవ్వాలని సిటీకి వచ్చే పాత్రలో కనిపించింది.