తారక్ తో “గుండమ్మ కథ” తీయాలని ఉందన్న నందిని రెడ్డి
August 24, 2017 / 02:01 PM IST
|Follow Us
మహానటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన అద్భుత సినిమా “గుండమ్మ కథ”. ఈ సినిమాని రీమేక్ చేయాలనీ చాలామంది దర్శకులు అనుకున్నప్పటికీ ధైర్యంగా ముందు అడుగు వేయలేకపోయారు. అయితే ఆ సినిమానే కాకపోయినా అటువంటి కథతో, నేటి జనరేషన్ కి తగ్గట్టు సినిమాని తెరకెక్కించాలని దర్శకురాలు నందిని రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. “అలా మొదలైంది” సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రేమ కథలను కొత్తగా చూపిస్తారనే పేరును సంపాదించుకున్నారు. ఆమె తన అభిమానులకు దగ్గరగా ఉండటానికి ఓ వెబ్సైట్ లింక్‌ను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీని ద్వార ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు, సందేహాలను కూడా అడగొచ్చు.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని “ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు తీస్తారు? మీ ఇద్దరి కాంబినేషన్లో ప్రేమకథ కోసం ఎదురుచూస్తున్నాం” అని సందేశం పంపారు. దీనికి ఆమె స్పందిస్తూ.. “అద్భుతమైన నటుడు ఎన్టీఆర్. అతనితో “గుండమ్మ కథ” లాంటి సినిమా తీయాలని ఉంది” అని సమాధానం ఇచ్చారు. నందిని రెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ కొత్తగా ఉంది.. ఈ కాంబోలో మూవీ కూడా సరికొత్తగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.