నేచురల్ స్టార్ నాని నాన్ స్టాప్ గా హిట్స్ కొడుతున్నారు. రీసెంట్ గా వేణు శ్రీరాం దర్శకత్వంలో నాని చేసిన MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీ కూడా భారీ కలక్షన్స్ సాధించింది. భారీ కథలకు పోకుండా, పెద్ద హంగామా లేకుండా ఆడుతూ పాడుతూ నాని విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు మరో సినిమాని సిద్ధం చేసి సందడి మొదలు పెట్టారు. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని నటిస్తున్న “కృష్ణార్జున యుద్ధం” సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో నాని డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్స్ తో పాటు.. సాంగ్ అదరగొట్టింది. నానికి మరో హిట్ రిజర్వేషన్ అయిపోయిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ బయటికి వచ్చింది.
ఈ సినిమా కథని మేర్లపాక గాంధీ మొదట శర్వానంద్ కి వినిపించారంట. అయితే లండన్ క్లాస్ కుర్రాడు, చిత్తూరు మాస్ కుర్రాడు మధ్య జరిగే ఈ కథ నచినప్పటికీ మాస్ కుర్రోడు పాత్ర తనకు సూట్ కాదని వదిలేశారంట. గతంలోను అర్జున్ రెడ్డి కథ తన వద్దకు వచ్చిన సరైన జడ్జిమెంట్ లేక వదులుకొని.. తరువాత తెగ బాధపడ్డారు. ఈ సినిమా విషయంలో శర్వానంద్ కి ఆ బాధ ఉంటుందా? లేదా? అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది. నాని ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి, కిశోర్ తిరుమలతో సినిమాలు చేయనున్నారు. దీంతో పాటు నాని.. అక్కినేని నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ సినిమాని కూడా ప్రారంభించనున్నారు.