“నానీ పన్ను విరిగింది” ఎగ్జాట్ ట్రాన్స్ లేషన్ కాకపోయిన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇవాళ నాని యాక్సిడెంట్ ను ఉద్దేసింది ప్రచురించిన కథనం ఇది. రాయడానికి మాకే ఇంత వెటకరంగా ఉంది, ఇక చదవడానికి మీకెంత వెటకారంగా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. సినిమా వాళ్ళు ఏం చేసినా న్యూసే అనే ఇంగితజ్ణానమ్ మాకూ ఉన్నప్పటికీ.. మరీ పన్ను విరిగింది అనే విషయాన్ని హెడ్డింగులో పెట్టడం ఏంటో మాత్రం అర్ధం కాలేదు. అసలే నాని వెబ్ సైట్లలో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి రకరకాలుగా వస్తున్న కథనాలపై ఎలా స్పందించాలో అర్ధం కాక సతమతమవుతుంటే.. ఇప్పుడు అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఓ ఆంగ్ల పత్రిక ఈ విధమైన కథనాన్ని ప్రచురించడం అనేది ఎంతవరకూ సమంజసం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. మామూలుగా పనికిమాలిన యూట్యూబ్ చానల్స్, అడ్రెస్ లేని వెబ్ సైట్స్ లలో ఈ తరహా వార్తలు దర్శనమిస్తుంటాయి.
ఇకపోతే.. నానీకి నిజంగా పన్ను విరిగిందా లేక మనోడి ఆరోగ్యం బాలేదా అనే విషయం పక్కన పెడితే.. “ఈ యాక్సిడెంట్ ఎందుకు అయ్యిందసలు?, ఒకవేళ అయినా కూడా మీడియాకు ఎందుకు తెలిసింది? అని ఆలోచిస్తూ తెగ చిరాకుపడుతున్నాడట నాని బాబు. సో ఇప్పటికైనా మీడియా ఈ విషయంలో కాస్త ఆలోచించి స్పందిస్తే నవ్వులుపాలు అవ్వకుండా ఉంటుంది. లేదంటే.. ఇలాగే జనాలు నవ్వుకొంటారు, భవిష్యత్ లో నిజంగా నిజం రాసినా నమ్మలేని పరిస్థితి వస్తుంది.