“ఇది చాలా అద్భుతమైన, ఆసక్తికరమైన కథండీ, ఈ సినిమాలో నాకూ నటించాలని ఉంది. కానీ.. ఏం చేస్తాం ప్రొడ్యూసర్ పెద్ద వేస్ట్ ఫెలో, నాకు నటించడానికి అవకాశం లేకుండా చేశాడు” అంటూ తన మిత్రుడు నానీపై ట్విట్టర్ లో ఈ విధమైన సరదా కామెంట్స్ చేశాడు. నాని-సిద్ధార్ధ్ ల మధ్య స్నేహబంధం ఎప్పుడు ఏర్పడిందో తెలియదు కానీ.. సిద్ధార్డ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తెలుగులో రిలీజ్ చేసిన “గృహం” ప్రమోషన్స్ లో నాని కీలకపాత్ర పోషించాడు. తెలుగు వెర్షన్ ట్రైలర్ లాంచ్ కి విచ్చేయడమే కాక సిద్ధూతో మీడియా ముందు బాతాఖానీ వేసి మరీ సినిమాని ప్రమోట్ చేశాడు.
మరి ఆ కృతజ్నతతోనో లేక స్నేహపూర్వకంగానో తెలియదు కానీ.. నాని నిర్మాతగా మారి రూపొందించిన “అ!” సినిమాలోని నాని వాయిస్ ఓవర్ ఇవ్వనున్న చేప లుక్ ను నాని ట్విట్టర్ ద్వారా షేర్ చేయగా.. దాన్ని సిద్ధూ రీట్వీట్ చేసి మరీ పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేశాడు. ఈ విధమైన స్నేహపూర్వక వాతావరణం ప్రస్తుతం టాలీవుడ్ ఈ చాలా అవసరం. ఈ ఇద్దరు మిత్రులను స్ఫూర్తిగా తీసుకొని ఇంకొందరు నటులు ఈ పద్ధతిని ఫాలో అయితే బాగుండు. ఇకపోతే.. నాని నటించిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” మొదటివారానికిగానూ దాదాపు 35 కోట్ల గ్రాస్, 27 కోట్ల షేర్ వసూలు చేసి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.