Dasara: ‘దసరా’ సినిమాలో సెన్సార్ కట్ చేసిన సన్నివేశాలు ఇవే!
March 24, 2023 / 07:31 PM IST
|Follow Us
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్థాయిలో ‘దసరా’ మూవీతో పెద్ద అటెంప్ట్ చేస్తున్నాడు.. సినిమాను తన భుజాల మీద వేసుకుని అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నాడు.. మూవీ రిజల్ట్ మీద నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచేశాయి.. కీర్తి సురేష్ కథానాయికగా.. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘దసరా’..
దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో, పాపులర్ మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.. మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.. ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్) పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయంటూ గట్టిగా చెప్పుకొస్తున్నారు.. శుక్రవారం (మార్చి 24) సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి.. సింగరేణి బొగ్గు కార్మికుల జీవితం ఆధారంగా.. ఆసక్తికర మలుపులతో, భారీ బడ్జెట్‌తో, యాక్షన్ రస్టిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘దసరా’ లో నేచురాలిటీకి పెద్ద పీట వేసినట్లు..
డైలాగులు, ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటలోని లిరిక్స్.. వాడుక భాషలోని బూతు పదాలతో రియాలిటీగా ఉన్నాయి.. కట్ చేస్తే వీటికి సెన్సార్ టీమ్ అభ్యంతరం తెలిపారు.. కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ మ్యూట్ చేయడమే కాక సబ్ టైటిల్స్‌లో టెక్స్ట్ (కొన్ని చోట్ల) తీసెయ్యాలని మరికొన్ని కట్స్.. మొత్తంగా 16 కట్స్ చెప్పారు.. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఫాంట్ సైజ్ పెంచమని చెప్పడం గమనార్హం..
1) బెంచూత్ (బెం మ్యూట్)..
2) బద్దల్ బాసింగలైతయ్ (బద్దల్ మ్యూట్)..
3) బాడకవ్ (మ్యూట్)..
వీటితో పాటు వాడుక భాషలో రెగ్యులర్‌గా (సందర్భాన్ని బట్టి) ఉపయోగించే పదాలను మ్యూట్ చేయాలని.. అలాగే సబ్ టైటిల్స్ టెక్స్ట్‌లోనూ మ్యూట్ చేసిన పదాలను తొలగించాలని సూచించారు.. మరి ‘దసరా’ టీమ్ సెన్సార్ వారి సలహాలను ఎంతవరకు పాటిస్తారో చూడాలి..