‘గ్యాంగ్ లీడర్’ ప్లాపైనా అంత రేటు పెట్టి కొన్నారా?

  • February 21, 2020 / 06:12 PM IST

గతేడాది ‘జెర్సీ’ చిత్రంతో హిట్టందుకున్న నాని… తరువాత ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో నిరాశపరిచాడు. మంచి ఓపెనింగ్స్ ను సాధించిన ‘గ్యాంగ్ లీడర్’ ఆ తరువాత మాత్రం జోరు చూపించలేక చతికిలపడిపోయింది. దీంతో నాని తన తరువాతి చిత్రాల పై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. తన 25వ చిత్రాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో చేస్తున్న నాని.. అటుతరువాత శివ నిర్వాణ డైరెక్షన్లో తన 26వ చిత్రం చేయబోతున్నాడు. ‘టక్ జగదీశ్’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం గత వారం సెట్స్ పైకి వెళ్ళింది.

అయితే ఈ చిత్రానికి సంబందించిన ఓవర్సీస్ బిజినెస్ అప్పుడే క్లోజ్ అయిపోయిందట. ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్లాప్ అయినప్పటికీ… ‘టక్ జగదీష్’ ను అక్కడ 4.2 కోట్లకు కొనుగోలు చేశారట. నానికి ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది కలిసి నిర్మిస్తున్నారు. గతంలో దర్శకుడు శివ నిర్వాణ, నాని కాంబినేషన్లో ‘నిన్ను కోరి’ వంటి సూపర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నిర్మాతలకి ‘మజిలీ’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శివ నిర్వాణ. మరి ఈసారి కూడా హిట్టిస్తాడేమో చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus