Tuck Jagadish Movie: ‘టక్ జగదీష్’ కు అంతకు మించిన బడ్జెట్ అయ్యిందట..!
September 4, 2021 / 10:05 PM IST
|Follow Us
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని ఓటిటి రిలీజ్ చేయబోతుండడం పై సర్వత్రా వ్యక్తిరేకత నెలకొన్న సంగతి తెలిసిందే. నాని ఈ విషయంలో చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. తన సినిమాని థియేటర్లలో విడుదలయ్యేలా అతను పలు చర్యలు చేపట్టాడు. కానీ వర్కౌట్ కాలేదు. చివరికి అది నిర్మాతల నిర్ణయాన్ని గౌరవించాలని డిసైడ్ అయ్యాడు. ఇక ‘టక్ జగదీష్’ ఓటిటి రిలీజ్ పై నిర్మాతలలో ఒకరైన సాహు గారపాటి తన స్పందనని తెలియజేసారు. సాహు గారపాటి మాట్లాడుతూ.. “థియేటర్ల కోసమే ‘టక్ జగదీష్ ను రెడీ చేశాం.
ఏప్రిల్‌లో విడుదల చేద్దామంటే కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా పడుతుంది అని అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిల్లో సినిమాను జనాల వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని.. భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం. గత డిసెంబర్లోనే షూటింగ్ ముగిసింది. ఎప్పుడు వీలైతే అప్పుడు థియేటర్లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. కానీ పరిస్థితులు మా కంట్రోల్లో లేవు.మా సమస్యలు మాకు ఉన్నాయి.. ఇండస్ట్రీ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ వచ్చింది. గిల్డ్ నుంచి కూడా మద్దతు లభించింది.
అందుకే మేం ఎక్కువగా మాట్లాడలేదు. హీరోలైనా, నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండుగ నాడు చూపించాల్సిన సినిమా.ప్రస్తుతం ఎక్కడా కూడా పరిస్థితులు చక్కబడలేదు. మన పక్క రాష్ట్రాల్లో కూడా ఇంకా అంతగా థియేటర్లు తెరవలేదు. విదేశాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. ఇది భారీ బడ్జెట్ చిత్రం.2020లో కరోనా ఎంట్రీ వల్ల మేకింగ్ కాస్ట్ ఎక్కువయ్యింది. పైగా యూనిట్ సభ్యుల్లో కొంతమంది కరోనా భారిన పడడం కూడా జరిగింది.సో మా భయానికి ఒక రీజన్ ఉంది.ఇది పక్కన పెడితే.. అన్ని చోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేనందుకే ఓటీటీకి వెళ్లాం. ఎస్ఆర్ కళ్యాణమండపం రిజల్ట్ వల్ల మా అభిప్రాయం మారలేదు.
ఆగస్ట్‌లో మేం థియేటర్‌కు రావాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్టు మాకు కనిపించలేదు. బిగ్ స్క్రీన్‌లో ఉన్నంత రెవెన్యూ ఓటీటీకి ఉండదు. ఉప్పెన, జాతిరత్నాల రిజల్ట్ ఎలా ఉందో అందరం చూశాం. రిస్క్ తీసుకున్నాం. ఇన్నాళ్లూ ఎదురుచూశాం. కానీ ఇంకా పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియడం లేదు.’వకీల్ సాబ్’ థియేటర్లలోకి వచ్చేసరికి కరోనా సెకండ్ వేవ్ కూడా వచ్చింది. 2 వారాలకు థియేటర్లు మూతపడ్డాయి.మా సినిమాకి కూడా అలాగే జరిగితే కష్టమవుతుందని ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం, ఆశ ఉంది. ఆ నమ్మకం ఉంటేనే బతకగలుగుతాం. మిగతా సినిమాలను కూడా రెడీ చేస్తున్నాం” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.