లాక్ డౌన్ కారణంగా బాగా ఇబ్బంది పడ్డ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఆయన నిర్మిస్తున్న అనేక ప్రాజెక్ట్స్ కి లాక్ డౌన్ సెగ తగిలింది. నాని, సుధీర్ ప్రధాన పాత్రలలో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ వి అంతా పూర్తి అయినా కూడా థియేటర్స్ బంధ్ కారణంగా విడుదలకు నోచుకోలేకపోతోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణా గవర్నమెంట్ షూటింగ్స్ కి అనుమతి ఇచ్చినప్పటికీ థియేటర్స్ తెరవడానికి పర్మిషన్స్ ఇచ్చే మార్గం కనిపించడం లేదు.
దీనితో ఆయన వి విషయంలో ఓ టి టి బెటర్ ఆప్షన్ అని భావిస్తున్నారట. విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ పెట్టుబడి వ్యయం పెరిగిపోతుంది. లాభాల కోసం థియేటర్స్ విడుదల కోసం ఆగడం కంటే సినిమాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేసి సొమ్ము చేసుకోవడం మంచిదని ఆయన ఆలోచన. మరో వైపు ఆయన నిర్మాతగా ఉన్న వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు వచ్చి ఆగిపోయింది. ఎటూ ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడానికి సమయం పడుతుంది.
కావున విడుదలకు సిద్ధంగా ఉన్న వి చిత్రాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయడం మంచి ఆలోచనగా ఆయన భావిస్తున్నారన్న సమాచారం అందుతుంది. మరి ఇదే కనుక జరిగితే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి రానున్న భారీ చిత్రం ఇదే అవుతుంది. ఎప్పుడో మార్చి లో విడుదల కావాల్సిన ఈ మూవీ రెండు నెలలుగా వాయిదాపడుతుంది.
Most Recommended Video
మేకప్ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!