నందమూరి నటసింహం బాలకృష్ణ కుమార్తెగా నారా బ్రాహ్మణి అందరికీ సుపరిచితమే. ఈమె బాలకృష్ణ కుమార్తెగా చంద్రబాబునాయుడు కోడలుగా ఇటు నారా కుటుంబ గౌరవాన్ని అటు నందమూరి కుటుంబ గౌరవాన్ని రెట్టింపు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా రాజకీయ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి బ్రాహ్మిని ఇటు రాజకీయాలలోకి గాని సినిమాలలోకి కానీ రాలేదు. ఈమె ఈ రెండు రంగాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు.
ఇలా ప్రముఖ మహిళ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బ్రాహ్మిని గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన. బాలయ్య కుమార్తెలు అంటే మంచి మర్యాదకు సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు అని చెప్పాలి. పెద్దలను గౌరవించడం నుంచి మొదలుకొని సహాయ సహకారాలు చేసే వరకు వీరికి ఎవరు సాటిరారు. ఇకపోతే బ్రాహ్మినికి తన తండ్రి బాలకృష్ణ అంటే ఎంతోప్రేమని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే తన తండ్రిపై ఉన్నటువంటి ప్రేమతో ఈమె ప్రతి ఏడాది తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 1000 మంది అనాధ పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టడమే కాకుండా వారికి మంచి దుస్తులను కూడా అందజేస్తారట. పుట్టినరోజు అంటే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి పబ్బులు పార్టీలలో గడపకుండా అనాధ పిల్లల కడుపు నింపి వారి మొహంలో సంతోషం చూడటం
బ్రాహ్మినికి ఎంతో ఇష్టమట అందుకే ఇప్పటికి తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఈమె అనాధ పిల్లలకు ఆహారం పెట్టడమే కాకుండా మంచి దుస్తులను కూడా అందజేస్తారన్న వార్త వైరల్ గా మారడంతో బ్రాహ్మిని మంచి ఆలోచన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!