Akhanda Movie: ఆ విషయంలో గర్వపడుతున్నానన్న బ్రాహ్మణి!
December 7, 2021 / 01:58 PM IST
|Follow Us
స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అఖండ మూవీపై కొంతమంది ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్లు చేసినా మెజారిటీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోవడం గమనార్హం. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి పాజిటివ్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణి అఖండ సినిమాను వీక్షించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. అఖండ సినిమా ఒక అద్భుతమని ఆమె కామెంట్లు చేశారు. అప్పుడు తాతగారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ను పెంచగా ప్రస్తుతం నాన్నగారు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ను పెంచారని బ్రాహ్మణి వెల్లడించారు. గతంలో నాన్నగారు చేసిన సినిమాలను మించి అఖండ సినిమా ఉందని బ్రాహ్మణి కామెంట్లు చేయడం గమనార్హం. తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం నాకు చాలా గర్వంగా ఉందని బ్రాహ్మణి చెప్పుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువాళ్లు అఖండ సినిమాను కచ్చితంగా చూడాలని బ్రాహ్మణి పిలుపునిచ్చారు. నైజాం, సీడెడ్ ఏరియాలలో అఖండ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు దక్కుతున్నాయి. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బాలయ్యతో మరికొన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నారు. 2021 సంవత్సరం సెకండాఫ్ లో భారీ లాభాలను సొంతం చేసుకున్న సినిమాగా అఖండ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖండ దర్శకుడు బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది.