Nara Lokesh: వైరల్ అవుతున్న లోకేశ్ షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

  • May 6, 2023 / 04:00 PM IST

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే తారక్ మాత్రం ఎక్కడా పొలిటికల్ విషయాలకు సంబంధించి ఎక్కడా మాట్లాడటం లేదు. అయితే తారక్ టీడీపీ తరపున ప్రచారం చేస్తే ఆ పార్టీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. తాజాగా లోకేశ్ మరోమారు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానని ఆయన తెలిపారు.

తారక్ తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని (Nara Lokesh) లోకేశ్ పేర్కొన్నారు. ఏపీ బాగుండాలని కోరుకునే వాళ్లు రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ చెప్పుకొచ్చారు. కర్నూలులోని ఒక హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉండటంతో ఎన్టీఆర్ మా వాడే అని ఇక్కడ అన్నీ అతని ఫోటోలే ఉన్నాయని లోకేశ్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా రాజకీయాల గురించి స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.

2024 ఎన్నికలకు ముందే తారక్ కొరటాల శివ కాంబో మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ సంథింగ్ స్పెషల్ గా ఉండనుందని బోగట్టా. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ మూవీగా నిలవనుందని బోగట్టా.

కొరటాల శివ గత సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు గత కొన్నేళ్లుగా వరుస విజయాలు దక్కుతుండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 80 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus