Nara Lokesh: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై నారా లోకేష్ కామెంట్స్!

  • February 25, 2023 / 12:21 PM IST

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి నిరంతరం డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. తన తాతలానే నంబర్ 1 హీరోగా ఎదిగాడు. కాబట్టి .. తన తాతలానే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించాలని, అభిమానులు , టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.భవిష్యత్తులో టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఉంది అనే నమ్మకం ఆ టైంలో అందరిలో ఏర్పడింది. అయితే ఎన్టీఆర్ కొడాలి నాని, వల్లభనేని వంశీ ల కారణంగా ఎన్టీఆర్ ..

నందమూరి , నారా కుటుంబాలకు దూరమయ్యాడు అని అంతా చెప్పుకుంటారు.అందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ దమ్ము సినిమాలో రాజకీయాల పై ఎన్టీఆర్ కొన్ని డైలాగులు చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అటు తర్వాత ఎన్టీఆర్.. రాజకీయాల గురించి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. హ్యాపీగా సినిమాలు చేసుకోవాలి.. ఇంకా ఇంకా ఇక్కడే సాధించాలి అని అనుకుంటున్నాడు. అయితే లక్ష్మీ పార్వతి వంటి వైసిపి మద్దతుదారులు ఎన్టీఆర్ కు టీడీపీ పార్టీని నిలబెట్టగల కెపాసిటీ ఉంది

అంటూ కామెంట్లు చేయడం పనిలో పనిగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం చంద్రబాబు, లోకేష్ లకు ఇష్టం లేదు అనడం .. అందరినీ ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై నారా లోకేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ..”జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. మీరు ఆహ్వానిస్తారా అని నన్ను అడిగారు.

నూటికి నూరు శాతం…, ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో , ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి..ఎవరైతే ఈ రాష్ట్రం అగ్ర స్థానానికి వెళ్ళాలి..ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి” అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus