మళ్లీ బుక్ అయిపోయిన పవిత్ర , నరేష్.. రెచ్చిపోయిన రమ్య రఘుపతి..వీడియో వైరల్..!

  • July 3, 2022 / 12:46 PM IST

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం విషయంలో మామూలు రచ్చ జరగడం లేదు. వీళ్ళిద్దరూ సహజీవనంలో ఉన్నట్టు.. చాలా కాలం నుండీ ప్రచారం జరుగుతుంది. ఇటీవల వీళ్ళిద్దరూ కలిసి ఓ బాబా ని కలుసుకోవడానికి వెళ్లడంతో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది.నరేష్ కు ఆల్రెడీ మూడు పెళ్ళిళ్ళు అయిన సంగతి తెలిసిందే. మూడో భార్య రమ్య రఘుపతి తో ఆయన ఇంకా విడాకులు తీసుకోలేదు.

అయినా సరే మరో పెళ్ళి చేసుకోవడానికి ఎలా రెడీ అయిపోయాడు అంటూ రమ్య రఘుపతి మీడియాను ఆశ్రయించింది.ఈ విషయంలో కన్నడ మీడియా యాక్టిివ్ గా ఉండి నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో పవిత్ర లోకేష్ .. మొత్తం బయటపెట్టేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. నరేష్, పవిత్ర పై రమ్య చేస్తున్న ఆరోపణలకి వారు కన్నడ మీడియా వద్దకు వెళ్ళి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో పవిత్ర లోకేష్, నరేష్ లు కలిసి ఓ హోటల్ లో స్టే చేస్తున్నారు అనే విషయం రమ్య కి తెలిసింది.

అంతే కర్ణాటక మైసూరు లో ఉన్న ఆ హోటల్ కు పోలీసులతో వెళ్లి ఆమె నానా రచ్చ చేసింది. ఓ దశలో ఆమె నరేష్ ను చెప్పుతో కొట్టడానికి కూడా రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రమ్య రఘుపతి చెప్పు తీసుకుని మీది మీదికి వస్తుంటే నరేష్ ఆమెను మరింత రెచ్చగొట్టే విధంగా వెకిలి చేష్టలు చేయడం మనం వీడియోలో గమనించవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags