మంచు మనోజ్ నిన్న అంటే మార్చి 3న రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికా రెడ్డిని.. మనోజ్ పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో ఉన్న మంచు లక్ష్మీ నివాసంలో మౌనిక- మనోజ్ ల పెళ్ళి కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్ళికి రారు అనుకున్న మోహన్ బాబు కూడా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.
ఈ వేడుకను అంతా తానై నడిపించింది మంచు మనోజ్ సోదరి లక్ష్మీ. ఇక వీరి పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమ నుండి అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. అందులో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ కూడా ఉండటం గమనార్హం. మంచు మనోజ్ పెళ్లి ఫోటోలు వీడియోల్లో వీరు కూడా హైలెట్ అయ్యారు. ఈ జంట కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ భార్య రమ్య రఘుపతి.. విడాకులకు అంగీకరించకపోవడంతో.. ఇతని నాలుగో పెళ్లి చేసుకునే వీలు లేకుండా పోయింది.
అందుకే వీళ్ళు సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ ఏ వేడుక జరిగినా వీళ్ళ ఎంట్రీ కచ్చితంగా ఉంటుంది. గతేడాది చివర్లో కృష్ణ, అతని భార్య మరణిస్తే.. వీళ్ళు అక్కడ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు మనోజ్ పెళ్ళిలో కూడా హైలెట్ అయ్యారు. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు.. ‘ప్రతిసారి వీళ్ళ ఎంట్రీ ఏంట్రా బాబు’ అంటూ అదుర్స్ లో బ్రహ్మానందం.. రమాప్రభ గురించి సెటైర్ వేసినట్టు.. కామెంట్లు పెడుతున్నారు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!