పెళ్లి బంధంతో ఒక్కటైన సీనియర్ నటులు నరేష్ – పవిత్ర లోకేష్.. వైరల్ అవుతున్న వీడియో!

  • March 10, 2023 / 12:10 PM IST

సీనియర్ నటులు వీకే నరేష్ – పవిత్ర లోకేష్ వివాహబంధంతో ఒక్కటయ్యారనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. నరేష్ – పవిత్రల మధ్య రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరంలేదు. చాలా కాలంగా వీళ్ళు సహజీవనం చేస్తున్నారు.  నరేష్‌కి ఇప్పటికే ముచ్చటగా మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి. మూడో భార్య రమ్య రఘుపతి.. ఇంకా తనతో విడాకులు తీసుకోలేదు అని మొన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా కర్ణాటకలోని ఓ హోటల్లో ఉండగా.. రమ్య రఘుపతి, ఈ ప్రేమ పక్షులను రెడ్ హ్యాండెడ్‌గా మీడియాకి పట్టించింది. అప్పటికీ వీళ్లు తమ రిలేషన్ గురించి ఓపెన్ అవలేదు కానీ కలిసి చాలా సందర్భాల్లో కనిపించారు. ఇక లాభం లేదనుకుని ఎట్టకేలకు 2023లో నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని డిసైడ్ అయ్యారు.

ఈ విషయాన్ని 2022 డిసెంబర్ 31న ఓ వీడియో ద్వారా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వీడియోలో నరేష్ – పవిత్ర లిప్ లాక్ పెట్టుకోవడం. లేటు వయసులో వీళ్ళ రొమాన్స్ చూసి ఇండస్ట్రీ వారితో పాటు నెటిజన్లు కూడా బిత్తరబోయారంటే నమ్మండి. ఇక వీడియోలో మీ అందరి ఆశీర్వాదం కావాలని ఈ జంట కోరింది.

ఇటీవల మంచు మనోజ్, భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుండి అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో నరేష్ – పవిత్ర జంటగా వచ్చి కొత్త జంటను ఆశీర్వదించడం విశేషం. ఇదిలా ఉంటే ఎట్టకేలకు ఈ లవ్ జంట ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో నరేష్ – పవిత్ర పెళ్లి బంధంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు నరేష్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

‘‘ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు

మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ  #PavitraNaresh ’’ అంటూ కామెంట్ చేశారాయన.. ఇంకో హైలెట్ ఏంటంటే.. వీరింకా వివాహం చేసుకోలేదు.. అది వారు నటించిన ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా జరిగిందని కూడా అంటున్నారు. ఈ వార్తలు చూసి నరేష్ రియాక్ట్ అయితే కానీ ఇది నిజం పెళ్లా?.. సినిమా పెళ్లా అనే విషయంలో క్లారిటీ రాదు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags