Naresh, Pavitra: పెళ్లి వీడియో గురించి మొదటిసారి స్పందించిన నరేష్… ఏమన్నారంటే?
March 11, 2023 / 02:15 PM IST
|Follow Us
సీనియర్ నటుడు నరేష్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాలవల్ల మీడియా వార్తలలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని మరొక నటితో రిలేషన్ లో ఉన్నారు. త్వరలోనే నటి పవిత్ర లోకేష్ తో పెళ్లి కూడా జరగబోతుందంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోని వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఈ వీడియో షేర్ చేస్తూ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామంటూ నరేష్ తెలిపారు.
అనుకున్న విధంగానే నటి పవిత్ర లోకేష్ తో కలిసి నరేష్ ఏడడుగులు నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్ల కోసం ఇలా చేశారా అని అనుమానం అందరిలోనూ కలుగుతుంది. ఇక ఈ వీడియో తాజాగా నటుడు నరేష్ స్పందించారు. హైదరాబాదులో ఇంటింటి రామాయణం సినిమా ప్రెస్ మీట్ లో ఈయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులు పవిత్ర నరేష్ తో పెళ్లి గురించి ప్రశ్నించారు.అసలు మీపెళ్లి ఎప్పుడు జరిగింది? మాకు మీ పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడుతున్నారు అంటూ మీడియా ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నరేష్ సమాధానం చెబుతూ ప్రస్తుతం ఈ సినిమా వేడుకలో తాను తన పెళ్లి గురించి మాట్లాడదలచుకోవడం లేదని తెలిపారు. మరొక ప్రతినిధి నరేష్ ని ప్రశ్నిస్తూ ప్రస్తుతం ప్రభాస్, సల్మాన్ పెళ్లి కన్నా మీ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నరేష్ సమాధానం చెప్పు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. నా లైఫ్ నేను జీవిస్తున్నాను ఈ ప్రెస్ మీట్ మరో విధంగా డైవర్ట్ చేయాలని తాను అనుకోవడం లేదు. తన పెళ్లి గురించి తన లైఫ్ గురించి మరొక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు తెలియజేస్తానంటూ ఈ సందర్భంగా నరేష్ తన పెళ్లి టాపిక్ దాటవేశారు. ఇలా నరేష్ తన పెళ్లి వీడియో గురించి నరేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.