Vijaya Nirmala: ఆస్తి మొత్తం ఆయన పేరు మీదే ఉంది.. నవీన్ కామెంట్స్ వైరల్!
August 31, 2023 / 06:37 AM IST
|Follow Us
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా దర్శకురాలిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి విజయనిర్మల ఒకరు. ఈమె మహిళా దర్శకురాలిగా ఏకంగా 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు ఎవరు కూడా ఇన్ని సినిమాలకు మహిళలు దర్శకత్వం వహించకపోవడం గమనార్హం. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విజయనిర్మల 2019వ సంవత్సరంలో మరణించిన సంగతి తెలిసిందే.
ఇక ఈమెకు పెళ్లి జరిగి బాబు జన్మించిన తర్వాత నటుడు కృష్ణని రెండవ పెళ్లి చేసుకున్నారు. ఇక ఈమె మరణించిన మూడు సంవత్సరాలకు కృష్ణ కూడా మరణించారు. దీంతో వీరు సంపాదించిన ఆస్తులకు వారసులు ఎవరు అన్న సందేహం అందరిలోనూ కలిగింది. అయితే తాజాగా నరేష్ మొదటి భార్య కుమారుడు నవీన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని విజయనిర్మల ఆస్తులకు వారసులు ఎవరు అనే విషయం గురించి మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఒకరోజు నాన్నమ్మ నాన్నతో మాట్లాడుతూ ఆస్తిలో సగభాగం నా పేరు మీద రాయమని చెప్పారు. అయితే అప్పుడు నాకు ఆస్తులపై పెద్దగా అవగాహన కూడా లేదు. ఇలా సగం ఆస్తికి నన్ను వారసుడిగాను మిగిలిన సగం ఆస్తి నాన్న పేరు మీద రాయాలని నాన్నమ్మ కోరింది. అయితే కొన్ని రోజుల తర్వాత నేను నాన్న ఒక అవగాహనకు వచ్చాము ప్రస్తుతం ఆస్తి మొత్తం నాన్న పేరు మీదనే ఉందని నవీన్ తెలిపారు.
నాకు ఈ ఆస్తులను హ్యాండిల్ చేయడం కూడా తెలియదు వాటిని కాపాడాలంటే కూడా పెద్ద బాధ్యత అందుకే ఆస్తులన్నీ నాన్న పేరు మీద ఉంటేనే మంచిదనిపించింది. అందుకే ఆస్తులన్నింటినీ కూడా నాన్న పేరు మీదనే వీలునామా రాశారు. ఇప్పటికి ఆస్తి మొత్తం నాన్న పేరు మీదనే ఉందని ఆయన యాక్టివ్ గా ఉన్నంతవరకు తన పేరు మీదనే ఉంటుందని ఆ తర్వాత ఈ ఆస్తిని కాపాడే బాధ్యత నాది అంటూ నవీన్ తెలిపారు.
ఇక ఆస్తుల విషయంలో ఎప్పుడూ మా మధ్య ఎలాంటి గొడవలు రాలేదని తెలిపారు. ఇక తన తమ్ముళ్లు రణవీర్, తేజ అంటే నాకు ఎంతో ఇష్టం రణవీర్ నరేష్ రెండో భార్య కుమారుడు కాగా తేజ రమ్య రఘుపతి కుమారుడు. తనకు తేజ అంటే చాలా ప్రాణమని ఎప్పుడు కూడా నేను వీరితో ఆస్తుల గురించి ఇతర విషయాల గురించి గొడవ పడిన దాఖలాలు లేవు అంటూ ఈ సందర్భంగా తన కుటుంబ విషయాల గురించి అలాగే ఆస్తుల గురించి నవీన్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.