Vijay Krishna: వాళ్లు బ్రతికుండగా అది నెరవేర్చలేకపోయాను: నవీన్
August 17, 2023 / 06:23 PM IST
|Follow Us
నవీన్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ అంటే మాత్రం అందరికీ ఈయన గుర్తుకు వస్తారు. ప్రముఖ నటి విజయనిర్మల మనవడిగాను నరేష్ కుమారుడుగా ఈయన ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈయన నటించిన సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో హీరోగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే చాలా కాలం తర్వాత ఈయన తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా మెప్పించలేకపోయినటువంటి నవీన్ డైరెక్టర్గా మారిపోయారు.
ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ హీరోగా ఈయన దర్శకత్వంలో సత్య అనే ఒక షార్ట్ ఫిలిమ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ షార్ట్ ఫిలిం ఈవెంట్లో నవీన్ మాట్లాడుతూ… తాను తన నాన్నమ్మ విజయనిర్మల కోరిక మేరకే హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాను కానీ నాకు హీరోగా కొనసాగడం ఏమాత్రం ఇష్టం లేదు హీరోగా చేయాలి అంటే నిజజీవితంలో కూడా నటించాల్సి వస్తుంది అది నా చేతకాదు అని తెలిపారు. చిన్నప్పుడు నాన్నమ్మ తో పాటు షూటింగ్ లోకేషన్ కు వెళ్లి అక్కడ అన్ని విషయాలు గమనించడంతో తనకు డైరెక్టర్ కావాలన్న కోరిక కలిగిందని తెలిపారు.
ఇకపై తాను డైరెక్టర్ గానే పనిచేస్తానని వెల్లడించారు. అలాగే నానమ్మ విజయనిర్మలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం తాను ఈ స్టేజ్ ఎక్కుతానా లేదా అన్న డౌట్ ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ ఏడాది నా జీవితంలో చాలా కోల్పోయానని ఈయన తెలియజేశారు. అక్కడినుంచి నేను మళ్లీ మీ ముందుకు వచ్చాను జీవితంలో ముందుకు వెళ్లడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
నానమ్మ విజయనిర్మల అమ్మ నేత్ర వీరిద్దరు కూడా నన్ను ఒక మంచి స్థాయిలో చూడాలని అనుకున్నారు. అయితే వారు బ్రతికుండగా ఆ కోరిక నెరవేరలేదు.అందుకే నేను వెనకడుగు వేయకుండా తిరిగి మళ్ళీ సత్యతో కమ్ బ్యాక్ ఇచ్చానని ఈ సందర్భంగా నరేష్ కుమారుడు నవీన్ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.