Naresh, Ramya: నరేష్ పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన అతని మూడో భార్య రమ్య రఘుపతి
January 6, 2023 / 07:45 PM IST
|Follow Us
సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం అందరికీ తెలిసిందే. గత ఏడాది నుండి ఇతను మూడో భార్యతో గొడవలు పెట్టుకుని సీనియర్ నటి పవిత్రా లోకేష్ తో కలిసుంటున్నాడు. మొదట ఆమె స్నేహితురాలు అన్నాడు. తర్వాత కలిసుంటున్నాం అంటూ కామెంట్లు చేశాడు. పవిత్ర లోకేష్ ను లిప్ లాక్ పెట్టుకుంటున్న రొమాంటిక్ వీడియోని షేర్ చేసి మరీ ఈ తన పెళ్లి గురించి ప్రకటించాడు. వీరి లిప్ లాక్ వీడియో ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
అయితే వీరి పెళ్ళికి అంగీకరించేది లేదు అంటూ ఇతని మూడో భార్య రమ్య రఘుపతి చెప్పి షాకిచ్చింది.నరేష్ ఎంత భరణం ఇవ్వడానికి రెడీ అయినా విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె చెప్పినట్టు వినికిడి. నరేష్ గురించి రమ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నరేష్ చాలా దుర్మార్గుడు. అతనితో నాకు జరిగింది మూడో పెళ్లి. అయినా పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎంతోమందితో ఎఫైర్స్ పెట్టుకుని నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.అతనికి ఎప్పుడూ అదే పని.
తప్పులన్నీ ఆయన చేసి.. నాపై ఆరోపణలు చేశాడు , చేస్తున్నాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నన్ను కావాలనే వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఇలా చేస్తున్నాడు. మాకు పెళ్లయ్యే ముందే చెప్పాను. పెళ్లి తర్వాత ఎఫైర్స్.. డివోర్స్ వంటివి పెట్టుకోకూడదని ఎప్పుడో చెప్పాను. అయినప్పటికీ పెళ్లయ్యాక మళ్ళీ ఎఫైర్స్.. డివోర్స్ వంటివి పట్టుకుని వేలాడుతున్నాడు. నేను అతనికి విడాకులు ఇవ్వను. ఎందుకంటే..
మాకు 10 ఏళ్ళ బాబు ఉన్నాడు. అతను తన తండ్రితో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. నరేష్ సుఖాల కోసం నేను నా కొడుకుని బాధపెట్టను. ఇన్నాళ్లు కృష్ణ మావయ్య గారి పరువు పోకూడదు అని సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు ఆ ఇంటిని విడిచిపెట్టే అవకాశం లేదు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రమ్య కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.