Nataraj Master: రవి నిజస్వరూపం బయటపెట్టిన నటరాజ్!

  • October 8, 2021 / 12:01 PM IST

బిగ్ బాస్ షో నుంచి గత వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నటరాజ్ మాస్టర్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోవద్దని నెటిజన్లు చెబుతున్నారు. తాజాగా నటరాజ్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ లో తాను తనలా ఉంటే మాత్రమే ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారని భావించానని నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

3 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా దక్కిందని ఆయన కామెంట్లు చేశారు. దొంగ నాటకాలు వేసేవాళ్లను ప్రేక్షకులు నమ్మారని జనాలను పూల్స్ చేస్తున్న కంటెస్టెంట్లకు మాత్రమే తాను జంతువుల పేర్లను పెట్టానని నటరాజ్ మాస్టర్ వెల్లడించారు. లహరి తన వెనుక పడుతోందని రవి మరో కంటెస్టెంట్ కు చెప్పడంతో తాను గుంట నక్క అనే పేరు పెట్టానని నటరాజ్ మాస్టర్ పేర్కొన్నారు. జెస్సీ, సిరి, షణ్ముఖ్ కలిసి ఆడుతున్నారని నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.

గతంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా తాను రిజెక్ట్ చేశానని నటరాజ్ మాస్టర్ తెలిపారు. మానస్, శ్రీరామ్ లలో ఒకరు బిగ్ బాస్ విన్నర్ అవుతారని ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి విశ్వ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నటరాజ్ మాస్టర్ అభిప్రాయపడ్డారు. బరువు తగ్గే టాస్క్ కొరకు నాలుగున్నర గంటలు డ్యాన్స్ చేశానని ఆ డ్యాన్స్ ప్రసారం కాలేదని నటరాజ్ మాస్టర్ పేర్కొన్నారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus