Bigg Boss Telugu OTT: నటరాజ్ మాస్టర్ ఫిల్టర్ లేకుండా చెప్పిన సంగతులు ఇవే..!
March 2, 2022 / 12:13 PM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత పార్టిసిపెంట్స్ తమ సొంతఇంటిని మర్చిపోయి మరీ బిగ్ బాస్ హౌసే తమ ఇల్లుగా చేసుకుని ఉంటుంటారు. ఇక్కడే బిగ్ బాస్ వాళ్లతో అన్ని పనులు చేయించడమే కాకుండా, మనసులో ఉన్న మాటలన్నింటినీ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాడు. అయితే, హౌస్ మేట్స్ అందరూ కూడా ఫిల్టర్ లేకుండా ఒక టాస్క్ ఆడమని చెప్పాడు బిగ్ బాస్. కార్డ్స్ లో నుంచీ ఒకటి సెలక్ట్ చేస్కుని అందులో ఏ ప్రశ్న అయితే ఉందో దానికి ఆన్సర్ చెప్పాలి.
ఈ ఆన్సర్ ని నిజాయితీగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడే ఫస్ట్ బిందుమాధవిని తను డేట్ కి వెళ్లాలి అంటే ఏ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో వెళ్తావ్ అని అడిగితే తను తన కాలేజ్ లో ప్రేమించిన అబ్బాయితో డేట్ కి వెళ్తానని చెప్పింది. కానీ, పేరు చెప్పలేదు. ఎందుకంటే, తనకి ఇప్పుడు పెళ్లి అయిపోయి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తర్వాత ముమైత్ ఖాన్ తన రిలేషన్ షిప్ లో బాయ్ ఫ్రెండ్ స్పేస్ అడిగితే పర్మినెంట్ గా ఇచ్చేశానని చెప్పింది.
తేజస్విని అయితే, తను రిలేషన్ షిప్ లో ఉన్న అందరితోనూ కాస్త తిక్క తిక్కగానే ఉంటానని చెప్పింది. అఖిల్ తన కిస్ గురించి, అలాగే అషూరెడ్డి ఇద్దరితో ఒకేరోజు చేసిన డేటింగ్ గురించి చెప్పారు. ఇక్కడే నటరాజ్ మాస్టర్ ని ఫన్నీగా హౌస్ మేట్స్ ఆటపట్టిస్తుంటే నేను చాలామందితో పెళ్లికాకముందు రిలేషన్ షిప్ లో ఉన్నానని, సెంచరీ దాటేసి ఉండచ్చని చెప్పారు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. తేజస్విని అయితే, వాళ్ల ఫ్యామిలీ అంతా ఓట్ వేస్తే చాలు మీరు సేఫ్ అయిపోతారని చెప్పింది. అంతే, ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు.
ఇదే టాస్క్ లో మిత్రా శర్మ మగాడిగా మారిపోతే ఫస్ట్ మా అమ్మ దగ్గరకి వెళ్లి చూడు నేను మగాడ్ని అయ్యానని చెప్తానని ఎమోషనల్ అయ్యింది. చిన్నప్పటి నుంచీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని, ఆడపిల్లగా పుట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశానని బాధపడింది. దీంతో అందరూ మిత్రాని ఓదార్చారు. ఇక హమీదా తన లవ్ గురించి అందరికీ తెలుసు అంటూనే చెప్పుకొచ్చింది. ఇక్కడే సరయు అడిగిన ప్రశ్నకి హమీదాకి కోపం వచ్చింది. దీంతో కాసేపు వీరిద్దరూ ఘర్షణ పడ్డారు.