Bindu,Nataraj: మాస్టర్ కావాలనే బిందుని టార్గెట్ చేశారా ? ఎందుకలా మాట్లాడారంటే..?
May 10, 2022 / 10:58 AM IST
|Follow Us
బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో బిందుమాధవికి మాస్టర్ కి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. 11వ వారం నామినేషన్స్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ బిందుని టార్గెట్ చేసి మరీ మాట్లాడారు. మీ నాన్న సరిగ్గా పెంచలేదు అని, ఫెయిల్ అయ్యారని, నువ్వు హీరోయిన్ గా కూడా ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చావని, నాటకాలు ఆడుతూ ఇంట్లో సర్వై అయ్యావ్ అంటూ రెచ్చిపోయి మాటలు విసిరారు. అంతేకాదు, బయట సోషల్ మీడియాలో డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటున్నావ్ అంటూ అందుకే ఫినాలే వరకూ వస్తున్నావ్ అంటూ మాట్లాడారు.
ఫైనల్స్ కి వెళ్లిపోయి కప్ తీస్కుని చెన్నై వెళ్లిపోదాం అనుకుంటున్నావ్ అని, మేము ఇక్కడే ఉండాలి అని తెలుగు వాళ్లమంటూ ప్రాంతీయ భావాన్ని సైతం గేమ్ లోకి తీస్కుని వచ్చారు. దీంతో బిందు మాధవి పర్సనల్ ఆర్గ్యూమెంట్స్ కి కౌంటర్స్ వేస్తు వచ్చింది. మాస్టర్ కెమెరాలు చూసి మాట్లాడుతుంటే, నాతో మాట్లాడండి మాస్టర్ అంటూ ఫేస్ టు ఫేస్ మాట్లాడింది. ఒకానొక దశలో ఇద్దరూ పర్సనల్ గా ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్లిపోయారు. మీరు కూడా పదే పదే మీ బిడ్డకోసం ఆడుతున్నాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడలేదా అంటూ బిందు మాస్టర్ ని నిలదీసింది.
నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసినందుకే బిందుతో ఆర్గ్యూమెంట్ చేశారని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వచ్చి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు. బయట ఏం జరగబోతోంది అన్నది ఒక క్లారిటీ హౌస్ మేట్స్ కి వచ్చేసింది. విషయం తెలిసినా కూడా తెలియనట్లుగానే గేమ్ ఆడుతున్నారు. అందులోనూ హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ పైన బిందు మాధవిని సెకండ్ పొజీషన్ లో పెట్టారు. దేవి నాగావల్లి అయితే ఫస్ట్ ప్లేస్ లో పెట్టి హౌస్ మేట్స్ కి హింట్ కూడా ఇచ్చింది.
దీంతో ఇప్పుడు అసలు గేమ్ ఆడకుండా ఎలా విన్నర్ అయిపోతోంది అనేది హౌస్ మేట్స్ కి అర్ధం కాలేదు. నటరాజ్ మాస్టర్ కావాలనే బిందుని టార్గెట్ చేసినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. సోషల్ మీడియాలో డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటున్నావ్ అంటూ బయట ఏం జరుగుతోందో కూడా మాస్టర్ అంచనా వేసి చెప్పారు. అంతేకాదు, అసలు నువ్వు గేమ్ ఆడకుండా ఇన్నిరోజులు ఎలా ఉన్నావ్ అంటూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నాలుగో వారమే నువ్వు ఎలిమినేట్ అయిపోవాల్సింది ఇన్ని రోజులు హౌస్ లో ఎలా ఉన్నావ్ అంటూ ప్రశ్నించారు.
ఇక దీనికి కౌంటర్ గా ఇప్పుడే మీకు ఈవిషయం గుర్తుకు వచ్చిందా అంటూ బిందు మాస్టర్ కి కౌంటర్ వేసింది. ఏది ఏమైనా మాస్టర్ కి హౌస్ లో విన్నర్ ఎవరు ? ఎవరి మద్యలో గట్టి పోటీ ఉంది అనేది తెలిసిపోయే ఇలా మట్లాడారా అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ పర్సనల్ గా ఇలా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మొత్తానికి అదీ మేటర్.