Bigg Boss Telugu OTT: సారీ చెప్తూ ఏడ్చేసిన నటరాజ్ మాస్టర్..! ఎందుకో తెలుసా?

  • February 28, 2022 / 01:41 PM IST

బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే ఎమోషనల్ జెర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. హౌస్ మేట్స్ ఒకరినొకరు నిందించుకుంటూ మొదటివారం నామినేషన్స్ ప్రక్రియని దిగ్విజంగా ముగించారు. ఇందులో భాగంగా ఆర్జే చైతూ తనని బాడీ షేమింగ్ చేయడం నాకు నచ్చలేదంటూ నటరాజ్ మాస్టర్ పై అభియోగం చేసి నామినేట్ చేశాడు. నామినేషన్స్ లో ఇద్దరూ చాలా హెటెడ్ ఆర్గ్యూమెంట్ చేస్కున్నారు. దాని తర్వాత బిగ్ బాస్ వారియర్స్ కి ఒక అవకాశం ఇచ్చాడు.

వారియర్స్ అందరూ ఏకాభిప్రాయంతో ఛాలెంజర్స్ నుంచీ ఇద్దరిని నేరుగా నామినేట్ చేయమని చెప్పాడు. దీంతో వారియర్స్ అందరూ బెడ్ రూమ్ లో డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. ఇక్కడే అకిల్, తేజస్విని, ఇంకా మిగిలిన సభ్యులు నటరాజ్ మాస్టర్ ని చైతూకి సారీ చెప్పండి మాస్టర్ అంటూ రిక్వస్ట్ చేశారు. నిజంగా మీరు సరదాగా చేసినా తను మాత్రం బాగా డీప్ గా ఫీల్ అయ్యాడని చెప్పారు. అందరూ కలిసి మిత్రా శర్మా ఇంకా ఆర్జే చైతూని నామినేట్ చేశారు.

ఇక్కడే అఖిల్ తో పాటుగా ఆర్జే చైతూ పేరుని చెప్పడానికి వచ్చిన నటరాజ్ మాస్టర్ బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇక్కడికి నేను నా బిడ్డని సైతం వదిలేసి వచ్చానని అయినా కూడా మీరు నామినేషన్ ట్యాగ్ తో బయటకి పంపించేయాలని చూస్తున్నారని వాపోయారు. అంతేకాదు, నేను సరదాగా అన్నానని, చైతూకి సారీ చెప్తూ బాగా ఏడ్చేశారు. ఏదైనా ఫీల్ అయితే అప్పటికప్పుడు చెప్తే సరిపోతుంది కానీ, దాన్ని నామినేషన్స్ లోకి ఎందుకు తీస్కుని వస్తున్నారని ప్రశ్నించారు. దీంతో ఆర్జే చైతూ కూడా ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు.

అంతేకాదు, చైతూ తనకి ఎవరు ఏమన్నా తీసుకుంటాను కానీ, బాడీ షేమింగ్ గురించి చిన్నప్పటి నుంచీ విని విని విసిగెత్తిపోయానని అందుకే అలా మాట్లాడాను అని చెప్తూనే బాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. బాధపడ్డాడు. అరియానా, అఖిల్ ఇద్దరూ వచ్చి కాసేపు చైతన్యని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇద్దరి మద్యలో హీటెడ్ ఆర్గ్యూమెంట్ అయిన తర్వాత సారీ చెప్తూనే ఇద్దరూ బాధపడ్డారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో సీనియర్స్ తో పాటుగా ఇద్దరు జూనియర్స్ కూడా రావాల్సి వచ్చింది. మరి ఈవారం ఇంటి నుంచీ బయటకి ఎవరు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus