‘వి’ తో పడబోతున్న ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’..!

  • March 7, 2020 / 06:01 PM IST

మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కు మంచి క్రేజ్ ఉంది. అందుకేనేమో హీరోగా కూడా ఓ ట్రైల్ వేద్దామని డిసైడ్ అయినట్టు ఉన్నాడు. ఇప్పటి వరకూ ‘100% లవ్’ ‘జులాయి’ ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ప్రదీప్ ఇప్పుడు ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. మున్నా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.వి.బాబు నిర్మించాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన ‘నీలి నీలి ఆకాశం పాట’ ఓ చార్టర్ బస్టర్ గా నిలవడమే కాకుండా సినిమాకి కావాల్సిన పబ్లిసిటీని తెచ్చి పెట్టింది.

అయితే ఈ చిత్రాన్ని.. మార్చి 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు డిసైడ్ అయ్యారని టాక్. అయితే అదే రోజున నాని – సుధీర్ బాబు ల ‘వి’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. నాని సినిమా కచ్చితంగా మంచి అంచనాలు ఉంటాయి. అందులోనూ దిల్ రాజు సినిమా కాబట్టి కచ్చితంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలవుతుంది. అయినప్పటికీ ప్రదీప్ అండ్ టీం ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నారేంటి అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు విడుదల చేస్తున్నాయి కూడా ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ డేర్ స్టెప్ తీసుకున్నట్టు సమాచారం.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus