తండ్రైన నవీన్ చంద్ర.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.!

  • February 23, 2023 / 10:02 AM IST

టాలీవుడ్ హీరో, విలక్షణ నటుడు అయిన నవీన్‌ చంద్ర తండ్రి అయ్యారు. ఆయన భార్య ఓర్మా బుధవారం నాడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా నవీన్ చంద్ర వెల్లడించడం జరిగింది. తన బిడ్డతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన నవీన్ చంద్ర… `నేను, ఓర్మా… కుమారుడితో ఆశీర్వదించబడ్డాము` అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఓ ఫొటోలో నవీన్ చంద్ర… తన బిడ్డ కాలుని ముద్దాడుతూ మరో ఫోటోలో తన బిడ్డ కాలుతో తన మొహాన తాకించుకుంటూ మురిసిపోతున్నట్టు స్పష్టమవుతుంది.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు నవీన్ చంద్రకి కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే నవీన్ చంద్ర పోస్ట్ చేసిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు కానీ హీరోగా నిలబడలేకపోయాడు. కానీ ఇతను ఎప్పుడూ ఖాళీగా ఉన్నది లేదు. ఏదో ఒక ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు

.’నేను లోకల్’ ‘అరవింద సమేత’ వంటి చిత్రాల్లో ప్రతినాయకుడు పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ హీరోలందరి సినిమాల్లో చిన్న చితకా పాత్రలు పోషిస్తూ మరో పక్క ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. నవీన్ చంద్ర తన పర్సనల్ లైఫ్ ను ఎప్పుడూ బయటపెట్టింది లేదు. గతేడాది వాలెంటైన్స్ డే రోజున తన భార్య ఓర్మా ఫోటోని షేర్ చేసి ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. సరిగ్గా ఏడాది తర్వాత తండ్రైనట్టు తెలిపాడు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus