యంగ్ హీరో కోసం విలన్ గా మరో యంగ్ హీరో!

  • March 10, 2018 / 11:39 AM IST

పాపం హీరోగా ఏళ్ల తరబడి ప్రయత్నించినా ఫలితం లేకపోవడం, సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన ఆశించిన స్థాయిలో పేరు కానీ ఆ తరహా పాత్రలు కానీ రాకపోవడంతో చేసేదేమీ లేక తనకున్న హైట్ & ఫిట్ నెస్ ను బేస్ చేసుకొని ఇప్పుడు విలన్ గా ప్రయత్నిస్తున్నాడు నవీన్ చంద్ర. “అందాల రాక్షసి”తో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర ఆ తర్వాత పది సినిమాలకు పైగా నటించినా ఒక్కటీ హిట్టవ్వలేదు. ఇక చేసేదేమీ లేక “నేను లోకల్”లో సపోర్టింగ్ రోల్ ప్లే చేసినా పెద్దగా ఒరిగిందేమీ లేదు.

అందుకే ఇప్పుడు విలన్ గా తన లక్ ని టెస్ట్ చేసుకోవాలనుకొంటున్నాడు. శ్రీనివాస్ అనే యువ దర్శకుడి నేతృత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో విలన్ గా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికలుగా కాజల్, కేతరీన్ లు నటిస్తుండగా నాని అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరి ఈ విలన్ రోల్ నవీన్ చంద్ర కెరీర్ కు ఏమేర ప్లస్ పాయింట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus