దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ఈ ఏడాది తాను ప్రేమించిన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే వీరి వివాహం జరిగిన నాలుగు నెలలకే పండంటి కవల మగ పిల్లలకు తల్లిదండ్రులు కావడంతో ఒక్కసారిగా నయనతార దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. గత ఏడు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నటువంటి నయనతార విగ్నేష్ పెళ్లికి ముందే సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులు కావాలని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే పెళ్లయిన నాలుగు నెలలకే తల్లిదండ్రులు కావడంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది. అయితే ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను చూపించడంతో ఈ వివాదం సర్దుమనిగింది. ఇకపోతే తాజాగా నయనతార నటించిన చిత్రం కనెక్ట్. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.సాధారణంగా నయన్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారు. అయితే ఇలా ఈ సినిమా ప్రమోషన్లకు పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ క్రమంలోనే యాంకర్ సుమ నయనతారను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా సుమ నయనతార వృత్తిపరమైన విషయాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నయనతారకు కవలలు జన్మించినప్పుడు తన గురించి వచ్చిన మీమ్స్ నయనతారకు చూపించారు. ముఖ్యంగా అదుర్స్ సినిమాలో ఈమెకు కవలలు పుడతారంటూ ముందుగానే ఎన్టీఆర్ జోస్యం చెప్పినటువంటి ఫోటోలను,
బ్రహ్మానందం తన ఇద్దరు పిల్లలను ఆడిస్తున్నటువంటి ఫోటోల ద్వారా మీమ్స్ క్రియేట్ చేశారు. ఇక ఈ ఫోటోలు చూసినా అనంతరం నయనతార ఈ మీమ్స్ పై స్పందిస్తూ… బహుశా నాకు కవలలు పుడతారని వివి వినాయక్ సర్ ముందే ఊహించారేమో అంటూ సరదాగా నవ్వుకున్నారు. ప్రస్తుతం నయన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!