స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా నయనతార పిల్లల్ని కనడం హాట్ టాపిక్ అయింది. సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇవ్వాలని నయనతార ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. ఇప్పటికే మాధవన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార ఈ సినిమా మినహా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని భావిస్తున్నారని బోగట్టా. ఈ మధ్య కాలంలో తన నుంచి వైరల్ అవుతున్న వార్తల వల్ల నయనతార హర్ట్ అయ్యారని బోగట్టా.
సినిమాలకు బ్రేక్ ఇవ్వడం ద్వారా ప్రశాంతత పొందాలని నయనతార భావిస్తున్నారు. మాధవన్ హీరోగా తెరకెక్కుతున్నసినిమా షూటింగ్ 2023 సంవత్సరం జనవరి నెల నుంచి మొదలుకానుందని తెలుస్తోంది. నయన్ డబ్బు కంటే మంచి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. నయనతార భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటుండగా ఆమె రెమ్యునరేషన్ కు భయపడి కూడా కొంతమంది నిర్మాతలు ఆమెను సినిమాలకు ఎంపిక చేయడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
నయనతార రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే నయన్ వరుస సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నయనతార కథ ఎంతో నచ్చితే మాత్రమే తెలుగు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రాజెక్ట్ ల ఎంపికలో ఇతర నటీమణులకు భిన్నంగా నయనతార వ్యవహరిస్తూ నయనతార అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
నయనతార సక్సెస్ రేట్ ఎక్కువగా హీరోయిన్లలో ఒకరు కావడం ఆమె కెరీర్ కు ప్లస్ అవుతోంది. రాబోయే రోజుల్లో నయనతార సినిమాలకు దూరమవుతారని మరి కొందరు చెబుతున్నారు. నయనతార వయస్సు పెరుగుతున్నా గ్లామరస్ గానే కనిపిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!