Nayanthara Weds Vignesh: ఘనంగా పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..!
June 9, 2022 / 04:48 PM IST
|Follow Us
హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ 7 ఏళ్ళ డేటింగ్ కు గుడ్ బై చెప్పి భార్యాభర్తలు అయిపోయారు. ఈరోజు అంటే జూన్ 9న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొద్దిపాటి బంధువులు, మిత్రులు, సన్నిహతులు, సెలబ్రిటీల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ నయన–విఘ్నేష్ ల పెళ్లి వేడుక తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది. మొదట తిరుపతిలో జరుగుతుందని అనుకున్నారు కానీ తర్వాత మహాబలిపురంలో జరుగుతున్నట్టు ప్రకటించారు.
ఇక వీరి పెళ్లి వేడుకకి షారుఖ్ ఖాన్, అట్లీ వంటి వారు హాజరయ్యారు. ముందుగా నయన్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు షారుక్. ఇక దర్శకుడు అట్లీ.. తన ఫ్యామిలీతో సహా ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఇక పెళ్లి ఫోటోలు కూడా కొన్ని గంటల నుండీ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :