Nayanthara, Vignesh: కవల పిల్లలు తో నయనతార, నయన్ విఘ్నేశ్.. వైరల్ అవుతున్న వీడియో!
October 25, 2022 / 12:26 PM IST
|Follow Us
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. మన జీవితాల్లోనూ ఇక్కట్లు అనే చీకట్లు తొలగిపోయి, సుఖ సంతోషాలనే వెలుగులు విరజిమ్మాలని దీపావళి పండుగను జరుపుకుంటాం.. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా దివాళీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సెలబ్రిటీస్ సంగతి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు.. నార్త్ నుండి మొదలు పెడితే ప్రతి ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు దివాళీ బాష్ లతో సందడి చేశారు. వాటికి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఇక సౌత్ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ కపుల్ కూడా దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. హైలెట్ ఏంటంటే తమ ఇద్దరు కవల పిల్లలతో కలిసి ఫ్యాన్స్, ఆడియన్స్ కి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. మొదట పిల్లలు పుట్టినప్పడు పిక్స్ షేర్ చేసిన ఈ స్టార్ కపుల్ మళ్లీ వాళ్లని చూపించడం ఇది రెండోసారి.. ఇద్దరూ చెరో బిడ్డను ఎత్తుకుని.. ‘విష్ యూ ఏ హ్యాపీ దివాళీ’ అంటూ.. ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి ‘ఎవ్రీ వన్’ బదులు ‘ఎవ్రీ టూ’ అని చెప్పారు..
నయన్ షేర్ చేసిన దివాళీ స్పెషల్ వీడియో నెటిజన్లను ఆకట్టకుంటోంది. కాజల్ అగర్వాల్ తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కపుల్ కి విషెస్ తెలియజేస్తున్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.. దాదాపు ఆరేళ్లకు పైగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ లో ట్విన్స్ పుట్టారని అనౌన్స్ చేశారు. దీంతో కొద్ది రోజులు వీళ్ల గురించి వార్తలు వైరల్ అయ్యాయి..
సరోగసీ ద్వారా నయన్ కవలలకు జన్మనిచ్చింది.. ఇండియాలో సరోగసీని నిషేదించారు కాబట్టి దీని గురించి వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం వీరికి నోటీసులు జారీ చేసింది. కట్ చేస్తే, తమకు ఆరేళ్లక్రితమే పెళ్లయ్యిందని ప్రూఫ్స్ చూపిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు నయన్ – విఘ్నేశ్ కపుల్..