Nayanthara: అబ్బో.. నయన్ పెళ్లికి కట్టుకున్న చీర అంత విలువైనదా..!
June 10, 2022 / 05:34 PM IST
|Follow Us
దాదాపు 7 ఏళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పటివరకు సహజీవనం చేస్తూ వచ్చారు. విగ్నేష్ శివన్ కోలీవుడ్ మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు. నయన్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించడం వెనుక ఇతని కృషి ఎంతో ఉంది. ఇక జూన్ 9న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయం పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది.
నయన్ క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ పద్దతిలోనే విగ్నేష్ ను పెళ్లి చేసుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా పెళ్ళికి పసుపు రంగు చీర కట్టుకుంటుంది పెళ్లి కూతురు. కానీ నయన్ మాత్రం డిజైనర్ శారీ కట్టుకుంది. విగ్నేష్ కుటుంబ సంప్రదాయం ప్రకారం.. ఎరుపు రంగు చీరని పెళ్లి కూతురు ధరించాల్సి ఉందట. అందుకే ఓ ప్రముఖ డిజైనర్ తో ఈ చీరని డిజైన్ చేయించుకుంది నయన్.
ఈ చీర కోసం 15 మంది ప్రత్యేకంగా పనిచేశారట. ఈ చీర డిజైన్ చేయించుకునేందుకు సుమారు రూ.25 లక్షల ఖర్చు చేసిందట నయన్. ముంబైలో ఈ చీరని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి కోసం ఫాబ్రిక్ ను ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించారట. ఈ చీరలో నయన్ నిజంగానే కుందనపు బొమ్మలా ఉంది. ఇక ఆమె ధరించిన జ్యూలరీ కూడా రూ.3 కోట్లు విలువ ఉంటుందని తెలుస్తుంది. దీనిని విఘ్నేష్ తల్లిదండ్రులు తమ ఇంటి కోడలైన నయన్ కు చేయించినట్లు తెలుస్తోంది.
ఇక నయన్- విఘ్నేష్ ల పెళ్ళికి తమిళనాడులోని సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. బాలీవుడ్ నుండీ షారుఖ్ ఖాన్ కూడా ప్రత్యేకంగా వచ్చి నయన్ కు బెస్ట్ విషెస్ చెప్పారు.పెళ్లి తర్వాత కూడా నయన్ సినిమాల్లో కొనసాగుతుంది. ఈ విషయంలో విఘ్నేష్ కానీ అతని తల్లిదండ్రులు కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.