Nayanthara Weds Vignesh Shivan: నయనతారకు ముద్దు పెడుతూ.. పెళ్లి ఫోటో షేర్ చేసిన విఘ్నేశ్ శివన్!
June 9, 2022 / 03:18 PM IST
|Follow Us
స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ 7 ఏళ్ళ డేటింగ్ కు గుడ్ బై చెప్పి భార్యాభర్తలు అయిపోయారు.ఈరోజు అంటే జూన్ 9న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొద్దిపాటి బంధువులు, మిత్రులు, సన్నిహతులు, సెలబ్రిటీల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇక పెళ్ళైన వెంటనే.. నయన్ భర్త విగ్నేష్ ఓ ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటోలో తాళి కట్టిన తర్వాత నయన్ నుదిటి పై అతను ముద్దు పెట్టుకుంటున్నట్టు కనిపిస్తుంది.
ఈ ఫోటో చాలా రొమాంటిక్ గా అదే విధంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన విగ్నేష్.. ‘షి ఈజ్ నయన్.. ఐ యామ్ ద వన్… దేవుడి దయ.. సృష్టి… మరియు బంధువులు, స్నేహితుల ఆశీర్వాదంతో ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం’ అంటూ విక్కీ నయన్ హ్యాష్ ట్యాగ్ లతో పోస్ట్ చేశాడు విగ్నేష్. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ నయన–విఘ్నేష్ ల పెళ్లి వేడుక తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది.
మొదట తిరుపతిలో జరుగుతుందని అనుకున్నారు కానీ తర్వాత మహాబలిపురంలో జరుగుతున్నట్టు ప్రకటించారు.ఇక వీరి పెళ్లి వేడుకకి షారుఖ్ ఖాన్, అట్లీ వంటి వారు హాజరయ్యారు. ముందుగా నయన్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు షారుక్. ఇక దర్శకుడు అట్లీ.. తన ఫ్యామిలీతో సహా ఈ పెళ్ళికి హాజరయ్యారు. వీరి కాంబినేషన్లో ‘జవాన్’ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో హీరో కాగా అనిరుధ్ సంగీతాన్ని అందించబోతున్నారు.