బాలయ్య 102వ సినిమా టైటిల్ ఖరారు!

  • July 7, 2017 / 06:11 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా గుర్తుందా….ఆ సినిమాలో ఒక పాత ఉంటుంది…రోమాలూ నిక్క పొడిచేలా…కొంచెం డిఫరెంట్ మాడులేషన్ తో ….రూలార్ అంటూ వచ్చే సాంగ్ మంచి హిట్ అయ్యింది…అయితే అదే క్రమంలో సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా…సాంగ్ మాత్రం ఇప్పటికీ చాలా మందికి ఫ్యావురేట్ గా ఉంది…ఇదిలా ఉంటే మరో పక్క టాలీవుడ్ రూలర్ బాలయ్య బాబు…తన 100వ సినిమాతో ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ప్రయోగాత్మక చిత్రాలను తనదైన శైలిలో చేస్తూ…దూసుకెళ్తున్న బాలయ్య…తన 101వ సినిమాగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో “పైసా వసూల్” అంటూ సెప్టెంబర్ లో బాక్స్ ఆఫీస్ పై దాడి చెయ్యనున్నాడు. ఇదిలా ఉంటే అసలు కధ ఇక్కడే ఉంది …ఈ 101వ సినిమా తర్వాత కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో బాలయ్య ఓ సినిమా షురూ చేశాడు అని టాలీవుడ్ టాక్. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గా ‘రూలర్’ అని పెట్టబోతున్నారని టాక్.

అయితే ఈ రూలర్ ను తారక్ తో చేయాలని చూసినా సరైన కథ దొరక్క వదిలేశాడు. ఇక ఇప్పుడు బాలయ్య తన సినిమాకు రూలర్ అని టైటిల్ పెట్టి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎన్.టి.ఆర్ చేయాల్సిన టైటిల్ తో బాలయ్య సినిమా చేస్తూ అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు…అసలే బాక్స్ ఆఫీస్ రూలర్ బాలయ్య….సైరైన కధ పడాలి కానీ…దుమ్ము దులిపెస్తాడు…చూద్దాం ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus